Share News

గుర్నూర్ బ్రార్ బౌలింగ్ సీక్రెట్ ఇదే.. కివీస్ బ్యాటర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే..?

ABN , Publish Date - Nov 08 , 2026 | 09:14 PM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో యువ భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొడుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. గుర్నూర్ బౌలింగ్ రహస్యాన్ని వివరించాడు.

గుర్నూర్ బ్రార్ బౌలింగ్ సీక్రెట్ ఇదే.. కివీస్ బ్యాటర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే..?
Gurnoor Brar

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో యువ భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొడుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో కివీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ముఖ్యంగా అతడు వేసే హార్డ్ లెంగ్త్ బంతులను ఎదుర్కోవడంలో న్యూజిలాండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రెండో వన్డేలో అతడు నాలుగు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. గుర్నూర్ బౌలింగ్ రహస్యాన్ని వివరించాడు.


‘భారత్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఆడుతున్నప్పుడు గుర్నూర్ బ్రార్ చివరిగా బౌలింగ్‌కు వస్తాడు. వన్డేల్లో రెండు కొత్త బంతులు ఉంటాయి కాబట్టి బంతి మరీ పాతబడిపోదు. అయితే గుర్నూర్ బంతిని పిచ్‌పై బలంగా వేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. దీంతో బంతిని సంధించే స్థానం కూడా ఎత్తులో ఉంటుంది. రెండో వన్డేలో టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్‌లను షార్ట్ పిచ్ బంతులతోనే ఔట్ చేశాడు. బ్యాటర్ కోణంలో చూస్తే బంతి ఎటు వైపు వస్తుందో వారు ముందుగా అంచనా వేయలేకపోతున్నారు. బంతి పడిన చోటును బట్టి చూస్తే అది బ్యాటర్ ఆడే పరిధిలోకి వచ్చినట్లు అనిపించదు. అవి గుడ్ లెంగ్త్ కంటే కొంచెం తక్కువ దూరంలో పడుతున్నప్పటికీ, అనూహ్యంగా వేగంగా పైకి వస్తుంది. అందుకే బ్యాటర్లు వాటిని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఆ బౌలింగ్ యాక్షనే గుర్నూర్ విజయానికి రహస్యం’ అని ఆకాశ్ చోప్రా వివరించాడు.


ఇవి కూడా చదవండి:

అండర్ 19 ఆసియా కప్: భారత్‌పై పాక్ విజయం

హార్దిక్ పాండ్య లేకపోయినా ముంబైకి పెద్దగా నష్టం లేదు: ఆకాశ్ చోప్రా

Updated Date - Nov 08 , 2026 | 09:14 PM