Share News

దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు

ABN , Publish Date - Nov 09 , 2026 | 06:42 AM

నగరంలో దీపావళి బాణసంచా కారణంగా కంటి గాయాలపాలైన 32 మంది మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిని ఆశ్రయించారు.

దీపావళి బాణసంచా ప్రమాదాలు.. 32 మందికి కంటి గాయాలు
సరోజినీ దేవి కంటి ఆసుపత్రి

హైదరాబాద్, నవంబర్ 9: నగరంలో బాణసంచా కారణంగా కంటి గాయాలపాలైన 32 మంది మెహదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిని ఆశ్రయించారు. మొత్తం 32 మందిలో ఆరుగురిని ఆసుపత్రిలో చేర్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 26 మందికి మందులు ఇచ్చి, తదుపరి చికిత్స కోసం తిరిగి రావాలని సూచించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి RMO డాక్టర్ ఇబ్రహీం మీడియాకు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన ఆరుగురిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు ఉన్నారు. వీరిలో ఒకరు బాణసంచా కారణంగా తన కుడి కంటిచూపును పూర్తిగా కోల్పోయారు. మిగిలిన బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


వారాంతంలో దీపావళి వేడుకలు జరగనున్న నేపథ్యంలో మరింత మంది బాధితులు ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉందని, వారికి చికిత్స అందించేందుకు ఆసుపత్రి సిద్ధంగా ఉందని డాక్టర్ ఇబ్రహీం పేర్కొన్నారు. టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షించాలని, యువత చేతిలో టపాసులు కాల్చడం వంటి ప్రమాదకరమైన సాహసాలకు పాల్పడవద్దని ఆయన సూచించారు.


ఈ వార్తలూ చదవండి

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు

కృష్ణా జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి.. తల్లిదండ్రుల ఆందోళన

Updated Date - Nov 09 , 2026 | 06:47 AM