Share News

రియాలిటీ షోలో మెరిసిన టీమిండియా బౌలింగ్ కోచ్.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 03 , 2026 | 03:29 PM

సాధారణంగా భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మైదానంలో క్రీడాకారులతో బిజీగా గడుపుతుంటాడు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ షోలో మోర్కెల్ మెరిశాడు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రియాలిటీ షోలో మెరిసిన  టీమిండియా బౌలింగ్ కోచ్.. వీడియో వైరల్
Morne Morkel

స్పోర్ట్స్ డెస్క్: భారత పురుషుల క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్, దక్షిణాఫ్రికా మాజీ స్టార్ పేసర్ మోర్నీ మోర్కెల్ వినోద రంగంలో సరికొత్త అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఖత్రోన్ కే ఖిలాడీ' రియాలిటీ షో 15వ సీజన్‌లో మోర్కెల్ ప్రత్యేక అతిథిగా మెరిశాడు. ఈ ఆగస్టు 1న ప్రారంభమైన ఈ షోలో మోర్కెల్ ఎంట్రీ ఇవ్వడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను షో నిర్వాహకుల రిలీజ్ చేశారు.


ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లోనే రోహిత్ శెట్టి పోటీదారులకు (Contestants) మోర్కెల్‌ను పరిచయం చేస్తూ, రాబోయే సవాలు ఎంత కఠినంగా ఉండబోతోందో హెచ్చరించాడు. ఇందులో భాగంగా మోర్కెల్ విసిరే బుల్లెట్ లాంటి బంతులను క్యాచ్ పట్టడమే కంటెస్టెంట్లకు ఇచ్చిన ప్రధాన స్టంట్. ఈ టాస్క్‌లో మోర్కెల్ గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. రాకెట్ వేగంతో బంతులు విసిరిన మోర్కెల్ కంటెస్టెంట్లకు చెమటలు పట్టించాడు.


ఇక అతడి కెరీర్ విషయానికి వస్తే... సౌతాఫ్రికా తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయంగా మొత్తం 544 వికెట్లు తీసిన మోర్కెల్.. తన కెరీర్‌లో ఎక్కువ బౌన్స్, వేగంతో బంతులు వేసి బ్యాటర్లను భయపెట్టేవాడు. 'ఖత్రోన్ కే ఖిలాడీ' రియాలిటీ షోను సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో చిత్రీకరించారు. ఈ తాజా సీజన్‌లో, రోహిత్ శెట్టి పర్యవేక్షణలో కంటెస్టెంట్లు భయానక స్టంట్లు చేస్తుండగా, మోర్కెల్ తన బౌలింగ్‌తో షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.


ఇవి కూడా చదవండి:

బ్రిజ్ భూషణ్‌కు కోర్టులో ఊరట... తీర్పుపై మండిపడ్డ మహిళా రెజర్లు

కామన్వెల్త్ గేమ్స్: ఏకంగా 8 స్వర్ణాలు.. భారత్ పతక వేటలో మహిళలదే ఆధిపత్యం

Updated Date - Aug 03 , 2026 | 03:31 PM