హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం..
ABN , Publish Date - Aug 03 , 2026 | 02:48 PM
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్ని, బోయిన్‌పల్లి, రసూల్‌పుర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, ప్యాట్ని, బోయిన్‌పల్లి, రసూల్‌పుర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అలాగే తార్నాక, హబ్సిగూడ, హిమాయత్‌నగర్, నారాయణగూడ ప్రాంతాల్లోనూ వాన కురిసింది. కుండపోతగా వర్షం పడటంతో ఆయా ప్రాంతాల్లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. పలుచోట్ల ద్విచక్ర వాహనదారులు వర్షం నుంచి తప్పించుకునేందుకు మెట్రోపిల్లర్ల వద్ద ఆశ్రయం పొందారు. మరోవైపు, వర్షంతో ఉక్కపోత నుంచి నగర ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. వాతావరణం మేఘావృతం కావడంతో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
వార్తలు కూడా చదవండి...
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం