నిజామాబాద్ ఆరోగ్య సేవలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష.. కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 03 , 2026 | 01:41 PM
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
నిజామాబాద్, ఆగస్టు 3: జిల్లాలో ఆరోగ్య సేవల పనితీరుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ ఆస్పత్రి పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు సహా సిబ్బంది అందుబాటు, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై మంత్రి విస్తృతంగా చర్చించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీలు), సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు అందుతున్న సేవల నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణపై అధికారులను ప్రశ్నించి అవసరమైన సూచనలు చేశారు.
జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల మౌలిక వసతుల అభివృద్ధి, కొత్త భవనాల నిర్మాణం, వైద్య పరికరాల అందుబాటు, అవసరమైన సిబ్బంది నియామకం, పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
వార్తలు కూడా చదవండి...
ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి
ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ విధానమా?.. కేటీఆర్ ధ్వజం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రజా ఉద్యమంగా నిర్వహిద్దాం: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News