Share News

ఇంగ్లండ్‌తో సిరీస్.. టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ

ABN , Publish Date - Nov 12 , 2026 | 10:23 AM

స్వదేశంలో ఇంగ్లండ్‌ మహిళల ఏ జట్టుతో జరుగబోయే మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం వేర్వేరు భారత మహిళల-ఏ జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20, వన్డే జట్లకు అనుష్క శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

 ఇంగ్లండ్‌తో సిరీస్.. టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ
Team India

స్పోర్ట్స్ డెస్క్: త్వరలో స్వదేశంలో మహిళల ఇంగ్లండ్-ఏ జట్టు, భారత్-ఏ మధ్య మల్టీ ఫార్మాట్ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫార్మట్లకు వేరువేరుగా భారత మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20, వన్డే జట్లకు అనుష్క శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. మల్టీ డే మ్యాచ్‌కు మిన్నూ మణి సారథిగా వ్యహరించనుంది. ఈ జట్లలో టీమిండియా ఆల్‌రౌండర్‌ శ్రేయాంక పాటిల్‌కు అవకాశం దక్కింది. మూడు ఫార్మాట్ల జట్లలో చోటు దక్కించుకున్న ఐదుగురు ఆటగాళ్లలో శ్రేయాంక ఒకరు. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన తర్వాత శ్రేయాంక మూడు జట్లలోనూ చోటు దక్కించుకుంది. పాటిల్‍తో పాటు మిన్ను మణి, షిప్రా గిరి, తనిషా సింగ్, సైమా ఠాకూర్ కూడా మూడు ఫార్మాట్లకు ఎంపికయ్యారు.


ఇంగ్లండ్-ఏతో జరిగే మూడు టీ20లు, మూడు వన్డేల్లో ఇండియా-ఏ జట్టుకు అనుష్క శర్మ నాయకత్వం వహించనుండగా... మిన్ను మణి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఇక మల్టీడే మ్యాచ్‌లో మిన్ను మణి కెప్టెన్‌గా... ఆమెకు డిప్యూటీగా తేజల్ హసబ్నిస్ ఉండనుంది. భారత్-ఏ, ఇంగ్లండ్-ఏ జట్ల మధ్య టీ20 సిరీస్ నవంబర్ 30న పుణెలో ప్రారంభం కానుండగా, ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 5న జరగనుంది. ఆ తర్వాత జట్లు వన్డే సిరీస్ కోసం ముంబైకి వెళ్తాయి. అనంతరం డిసెంబర్ 19న వాంఖడే స్టేడియంలో మల్టీ-డే మ్యాచ్ జరగనుంది.


టీ20లకు భారత్-ఏ జట్టు:

అనుష్క శర్మ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్), వృందా దినేశ్, తనీషా సింగ్, సనికా చాల్కే, నికీ ప్రసాద్, జి. కమలిని, షిప్రా గిరి(వికెట్ కీపర్), అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, వైష్ణవి శర్మ, ప్రేమ రావత్, సైమా ఠాకూర్, మోనికా పటేల్, కాశ్వీ గౌతమ్.

వన్డేలకు భారత్-ఏ జట్టు:

అనుష్క శర్మ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్), వృందా దినేశ్, తనీషా సింగ్, ప్రియా పునియా, నికీ ప్రసాద్, జి. కమలిని, షిప్రా గిరి(వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, శ్రేయాంక పాటిల్, అమిషా బహుకండి, షబ్నమ్ షకీల్, సైమా ఠాకూర్, అక్షితా భగత్, కాశ్వీ గౌతమ్.

మల్టీ డే మ్యాచ్‌కు భారత్-ఏ జట్టు:

మిన్ను మణి (కెప్టెన్), తేజల్ హసబ్నిస్ (వైస్ కెప్టెన్), శుభా సతీష్, ప్రియా పునియా, తనీషా సింగ్, పూర్వజా వెర్లేకర్, హెన్రియెట్టా పెరేరా, షిప్రా గిరి(వికెట్ కీపర్), ఉమా ఛేత్రి(వికెట కీపర్), శ్రేయాంక పాటిల్, సైమా ఠాకూర్, అక్షితా భగత్, అమిషా బహుకండి, హ్యాపీ కుమారి, షబ్నమ్ షకీల్.


ఇవి కూడా చదవండి..

ఎన్విడియా నుంచి తీసేస్తే నేను ఉద్యోగం ఇస్తా.. అది నాకు గౌరవం: మస్క్

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 12 , 2026 | 10:27 AM