కివీస్ జట్టులో అనూహ్య మార్పులు.. 31 ఏళ్ల పేసర్‌కు తొలి అవకాశం..
ABN , Publish Date - Nov 12 , 2026 | 09:19 AM
భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా చివరి రెండు వన్డేల కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) జట్టులో కీలక మార్పులు చేసింది. పెద్దగా గుర్తింపులేని పేసర్ బ్రెట్ రాండెల్‌ను జట్టులోకి ఎంపిక చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా చివరి రెండు వన్డేల కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (NZC) జట్టులో కీలక మార్పులు చేసింది. పెద్దగా గుర్తింపులేని పేసర్ బ్రెట్ రాండెల్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. అలానే ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్సన్‌ను ఐదో వన్డే కోసం స్క్వాడ్‌లోకి తీసుకున్నట్లు బోర్డు గురువారం ప్రకటించింది. మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతుండగా.. నాలుగో వన్డే శుక్రవారం, ఐదో వన్డే (సిరీస్ ఆఖరి మ్యాచ్) ఆదివారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్ మేనేజ్‌మెంట్ జట్టును మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది.
31 ఏళ్ల బ్రెట్ రాండెల్ దేశీయ క్రికెట్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 145 ప్రొఫెషనల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న అతడు, అందులో ఐదుసార్లు న్యూజిలాండ్ 'ఏ' జట్టు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డెబ్బీషైర్ తరఫున ఆడి తిరిగి వచ్చిన రాండెల్.. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ప్రదర్శనల కారణంగానే అతడికి నాలుగో వన్డేలో స్థాన దక్కింది. న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. తొలిసారి అంతర్జాతీయ జట్టుకు ఎంపికైన బ్రెట్ రాండెల్‌కు అభినందనలు తెలిపారు. దేశీయ టోర్నీల్లో అతను కనబరుస్తున్న నిలకడైన ప్రదర్శనే ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టిందని, తుది జట్టులో ఆడే అవకాశం కూడా అతనికి దక్కవచ్చని పేర్కొన్నారు. సిరీస్ మధ్యలో కొన్ని మార్పులు జరగడం వల్ల రాండెల్, క్లార్క్సన్ లాంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం సాధ్యపడిందని వాల్టర్ వెల్లడించారు.
న్యూజిలాండ్ జట్టు:
నాలుగో వన్డే:
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే (వికెట్ కీపర్), మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, బ్రెట్ రాండెల్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), విల్ యంగ్.
ఐదో వన్డే:
మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, బ్రెట్ రాండెల్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.
ఈ వార్తలు కూడా చదవండి..
మానసిక ఒత్తిడితోనే కుటుంబం ఆత్మహత్య
అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్
ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ