ఎన్విడియా నుంచి తీసేస్తే నేను ఉద్యోగం ఇస్తా.. అది నాకు గౌరవం: మస్క్
ABN , Publish Date - Nov 12 , 2026 | 09:40 AM
ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ చుట్టూ వివాదం ముదురుతున్న వేళ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ చుట్టూ వివాదం ముదురుతున్న వేళ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఎలాన్.. దయచేసి జెన్సెన్‌ను నియమించుకోండి' అంటూ ఓ నెటిజన్ చేసిన సూచనకు మస్క్ స్పందించారు. 'అది నాకు గౌరవంగా ఉంటుంది' అంటూ సమాధానమిచ్చారు. దీంతో టెక్ ప్రపంచంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి (Elon Musk Hiring Jensen Huang).
చైనా గూఢచారిగా భావిస్తున్న మహిళతో అఫైర్ నేపథ్యంలో ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. అతడిని సీఈవోగా తొలగించేందుకు ఎన్విడియా బోర్డు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆలిస్ హువాంగ్ అనే చైనా వ్యాపారవేత్తతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అలాగే ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం ఉపాధ్యక్షురాలు కింబర్లీ పావెల్‌తోనూ ఆయనకు సంబంధం ఉందంటూ మరో కథనం వెలువడింది. ఈ పరిణామాల నేపథ్యంలో హువాంగ్ భవిష్యత్తుపై ఎన్విడియా బోర్డు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ అభిప్రాయపడింది (Nvidia CEO Controversy).
ఇలాంటి తరుణంలో జెన్సన్‌కు మస్క్ మద్దతుగా మాట్లాడడం ఆసక్తిరంగా మారింది (Elon Musk Jensen Huang). జెన్సెన్ హువాంగ్‌కు మస్క్ మద్దతు తెలపడం ఇదే మొదటిసారి కాదు. హువాంగ్ ఒక గొప్ప వ్యాపారవేత్త అని, అమెరికా కృత్రిమ మేధ రంగంలో ఆయన కీలకమని ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు మస్క్ స్పందిస్తూ.. తాను కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానన్నారు. అంతేకాదు, ఇద్దరి మధ్య చాలా కాలంగా వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. 2016లో ఎన్విడియా తయారు చేసిన డీజీఎక్స్-1 ఏఐ సూపర్ కంప్యూటర్‌ను తొలిసారిగా కొనుగోలు చేసింది మస్క్ సంస్థే. ఆ కంప్యూటర్‌ను జెన్సెన్ హువాంగ్ స్వయంగా మస్క్ కార్యాలయానికి తీసుకెళ్లి అందించారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..