వరల్డ్ కప్ ఫేవరెట్ల లిస్టులో భారత్ లేదట... షాక్ ఇచ్చిన గావస్కర్..
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:38 PM
పొట్టి ప్రపంచ కప్ చివరి దశకు చేరుతున్న కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈసారి టైటిల్ గెలిచే ఫేవరెట్ జట్ల జాబితా నుంచి టీమిండియాను పక్కన పెట్టేశాడు
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్2026 చివరి దశకు చేరుతున్న కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈసారి టైటిల్ గెలిచే ఫేవరెట్ జట్ల జాబితా నుంచి టీమిండియాను పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం భారత్ సెమీఫైనల్ రేసులో ఉన్నప్పటికీ, టైటిల్ నెగ్గే సత్తా మాత్రం లేదని అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతానికి కప్పు గెలిచే సత్తా ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లకే ఉందని గావస్కర్ కుండబద్దలు కొట్టారు. సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు మద్దతు ఇవ్వకుండా, గావస్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత సూపర్- 8 పరిస్థితులను గమనిస్తే.. భారత్, వెస్టిండీస్ జట్లు సెమీస్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. మార్చి 1న కోల్‌కతా వేదికగా జరగబోయే భారత్-వెస్టిండీస్ మ్యాచ్ సెమీస్ దిశగా అత్యంత కీలకం కానుంది. అయితే గావస్కర్ మాత్రం సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల బౌలింగ్, బ్యాటింగ్ డెప్త్ చూసి ముగ్ధులయ్యారట. ముఖ్యంగా సౌతాఫ్రికా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
ఇంగ్లండ్ జట్టుపై గావస్కర్ ప్రశంసలు కురిపిస్తూ.. ఆ జట్టులో స్పిన్, పేస్ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. టోర్నీ ఆరంభంలో నేపాల్‌పై అతికష్టంగా నెగ్గి, వెస్టిండీస్ చేతిలో ఘోరంగా ఓడిపోయినప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా శ్రీలంక, పాకిస్థాన్‌లను స్పిన్ పిచ్ లపై ఓడించడం ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని ఆయన విశ్లేషించాడు. తన దృష్టిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లే అసలైన ఫేవరెట్లని, భారత్ కంటే ఈ రెండు జట్లకే కప్పు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ జాతీయ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఏదేమైనా గావస్కర్ లాంటి దిగ్గజం భారత్‌ను తక్కువ అంచనా వేయడం అభిమానులకు మాత్రం మింగుడుపడటం లేదు.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: ఇలా జరిగితే.. మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్..
పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే