‘బ్లూ జెట్ హెల్త్ కేర్’ ఔషధ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:50 PM
అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని మంత్రి అన్నారు.
అనకాపల్లి జిల్లా, ఫిబ్రవరి 28: రాంబిల్లి మండలం సీతపాలెం సమీపంలో ‘బ్లూ జెట్ హెల్త్ కేర్’ (Blue Jet Healthcare) ఔషధ తయారీ యూనిట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. మంత్రి నారా లోకేశ్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు శ్రీకారం జరిగిందని తెలిపారు.
ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగంలో బ్లూజెట్ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందన్నారు లోకేశ్. ఈ పరిశ్రమకు ప్రభుత్వం 102.48 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. మూడు దశల్లో అత్యంత వేగంగా ఫార్మా కంపెనీని నిర్మించనున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
1750 మందికి ఉద్యోగాలు..
రూ. 2,300 కోట్ల వ్యయంతో ఔషధ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 102.48 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగనుంది. మూడు దశల్లో అత్యంత వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 1,750 మందికి బ్లూ జెట్ పరిశ్రమ ఉద్యోగాలను కల్పించనుంది.
ఇవి కూడా చదవండి...
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. లక్షల మందికి నగదు పంపిణీ
ఏపీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News