Share News

మీవి డేగ కళ్లు అయితే.. ఈ తోటలో తేనెటీగను 10 సెకెన్లలో గుర్తించండి..

ABN , Publish Date - Feb 28 , 2026 | 02:40 PM

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

మీవి డేగ కళ్లు అయితే.. ఈ తోటలో తేనెటీగను 10 సెకెన్లలో గుర్తించండి..
Optical Illusion

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్‌. ఆ ఫొటోలో ఓ పూల తోట కనబడుతోంది. పసుపు రంగు పూలతో పాటు పలు రకాల జంతువులు కూడా ఉన్నాయి. అయితే ఆ తోటలో ఓ తేనెటీగా కూడా ఉంది. 10 సెకెన్ల వ్యవధిలో ఆ తేనెటీగను కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 10 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఈ తోటలో తేనెటీగా ఎక్కడుందో తెలుస్తుంది.

puzzle4.jpg


ఈ వార్తలూ చదవండి:

ఇరాన్‌పై దాడులు.. దద్దరిల్లిన రాజధాని

నేను జోక్యం చేసుకునేవాణ్ణే కానీ.. అఫ్గాన్-పాక్ ఘర్షణలపై ట్రంప్ కామెంట్

Updated Date - Feb 28 , 2026 | 02:40 PM