Share News

నేను జోక్యం చేసుకునేవాణ్ణే కానీ.. అఫ్గాన్-పాక్ ఘర్షణలపై ట్రంప్ కామెంట్

ABN , Publish Date - Feb 28 , 2026 | 09:39 AM

అఫ్గాన్-పాక్ ఘర్షణల అంశంలో తాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేనట్టు కనిపిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. పాక్ ప్రధాని, ఆర్మీ జనరల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

నేను జోక్యం చేసుకునేవాణ్ణే కానీ.. అఫ్గాన్-పాక్ ఘర్షణలపై ట్రంప్ కామెంట్
Trump on Afghanistan-Pakistan conflict

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్, పాక్ ఘర్షణలపై (Afghan-Pak Clashes) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తన జోక్యం అవసరం లేనట్టు కనిపిస్తోందని అన్నారు (Donald Trump). పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌పై ప్రశంసలు కురిపించారు. వాళ్లు గ్రేట్ అంటూ కొనియాడారు.

‘నేను జోక్యం చేసుకునేవాణ్ణే కానీ పాక్ ప్రధాని అద్భుతమైన వ్యక్తి. పాక్ జనరల్ కూడా గొప్ప వారే. వాళ్లిద్దరిపై నాకు చాలా గౌరవం ఉంది. ప్రస్తుతం పాక్ పరిస్థితి బాగానే ఉంది’ అని ట్రంప్ శుక్రవారం విలేకరులతో వ్యాఖ్యానించారు.

ఇటీవల అఫ్గానిస్థాన్, పాక్ మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం కాబూల్, కాందహార్ సహా అఫ్గానిస్థాన్‌లోని 29 ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులకు దిగింది. అఫ్గాన్ ఉగ్రవాదులే టార్గెట్‌గా ఈ దాడులు చేసినట్టు ప్రకటించింది. ఈ దాడుల్లో 297 మంది అఫ్గానీ మిలిటెంట్లు, తాలిబాన్లు మరణించారని తెలిపింది. ప్రత్యర్థులు కోలుకోలేని విధంగా తమ సైన్యం దెబ్బకొడుతోందని పేర్కొంది. పాక్ సైన్యానికి దేశ ప్రజల పూర్తి మద్దతు ఉందని చెప్పింది.


ఈ పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి కూడా స్పందించారు. స్వీయ రక్షణ పాకిస్థాన్‌కు ఉన్న హక్కు అని కామెంట్ చేశారు. తాలిబాన్ల దాడుల నుంచి తనని తాను రక్షించుకునేందుకు పాక్ తీసుకుంటున్న చర్యలకు అమెరికా మద్దతు ఇస్తోందని అన్నారు.

తమ దేశంలో జరుగుతున్న ఆత్మాహుతి దాడులకు అఫ్గానిస్థాన్ కారణమని పాక్ చాలా కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అఫ్గానిస్థాన్ మాత్రం ఈ ఆరోపణలను ఇప్పటికే పలుమార్లు ఖండించింది.


ఈ వార్తలూ చదవండి:

ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌‌‌తో లావాదేవీలు బంద్.. ట్రంప్ ఆదేశాలు

భారత్‌ విషయంలో వెనక్కు తగ్గిన కెనడా!

Updated Date - Feb 28 , 2026 | 11:26 AM