Share News

తన పోస్ట్‌తో ఆర్సీబీని సరదాగా ఆటపట్టించిన శుభ్‌మన్ గిల్!

ABN , Publish Date - May 01 , 2026 | 01:51 PM

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు 4 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టును సరదగా ఆటపట్టిస్తూ గుజరాత్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

తన పోస్ట్‌తో ఆర్సీబీని సరదాగా ఆటపట్టించిన శుభ్‌మన్ గిల్!
Shubman Gill mocks RCB

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళురు 4 వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టును సరదగా ఆటపట్టిస్తూ గుజరాత్ జట్టు కెప్టెన్ ఓ పోస్ట్ పెట్టాడు. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ ఫొటొను షేర్ చేస్తూ.. ప్లే బోల్డ్ అని గిల్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


నిన్న గుజరాత్, ఆర్సీబీ జట్ల మధ్య మైదానంలో చిన్నపాటి వాగ్వాదాలు జరిగినప్పటికీ తనకు, కోహ్లీకి మధ్య ఉన్న స్నేహాన్ని హైలైట్ చేస్తూ గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీ ట్యాగ్‌లైన్‌ అయిన 'ప్లే బోల్డ్‌'ను పోస్ట్ చేశాడు. 'ఈ రాత్రి జట్టు అద్భుతంగా ఆడింది. జేసన్ హోల్డర్.. ప్లే బోల్డ్' అంటూ గిల్ పరోక్షంగా ఆర్సీబీని సరదగా ఆటపట్టించాడు.


గిల్, కోహ్లీలు ఎంతో స్నేహంగా ఉంటారు. ఈ ఇద్దరూ మ్యాచ్ సమయంలో ఒకరినొకరు ఆటపట్టించుకున్నా, స్లెడ్జింగ్ చేసుకున్నా, చివరికి గొడవపడినా ఆ విషయాలను వీరిద్దరు అసలు సీరియస్‌గా తీసుకోరు. నిన్న ఆర్సీబీ, జీటీ మధ్య జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని అభిమానులు అనేక సందర్భాల్లో గమనించారు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ ఇన్‌ స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ 'కింగ్' కోహ్లీ, శుభ్‌మన్ గిల్ మధ్య ఉన్న స్నేహాన్ని మరింత స్పష్టం తెలియజేసింది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన భువ‌నేశ్వర్

రజత్ పాటిదార్ ఔట్ వివాదం.. స్పందించిన జేసన్ హోల్డర్

Updated Date - May 01 , 2026 | 02:52 PM