రజత్ పాటిదార్ ఔట్ వివాదం.. స్పందించిన జేసన్ హోల్డర్
ABN , Publish Date - May 01 , 2026 | 11:56 AM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ వివరణ ఇచ్చాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(గురువారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన మ్యాచ్‌లో రజత్ పాటిదార్ ఔట్ అయిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో పాటిదార్ పుల్ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఉన్న జేసన్ హోల్డర్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అయితే హోల్డర్ క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతి నేలకు తగిలినట్లు రిప్లేలో కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జేసన్ హోల్డర్ స్పందిస్తూ.. తాను పట్టిన క్యాచ్ సరైందేనని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడంతో జేసన్ హోల్డర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా హోల్డర్ మాట్లాడుతూ.. 'వ్యక్తిగతంగా ఈ రోజు నాకు బాగా కలిసొచ్చింది. కొన్నిసార్లు ఇలా మనకు అనుకూలంగా జరుగుతుంటాయి. మా జట్టు అద్భుతంగా రాణించింది. పవర్‌ప్లేలో రబాడ, సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు అద్భుతం. వారు గేమ్‌ను మా వైపు తిప్పారు' అని తెలిపాడు.
ఇక రజత్ పాటిదార్ క్యాచ్ ఔట్ గురించి ప్రస్తావిస్తూ.. 'నేను పట్టిన ఆ క్యాచ్ సరైనదే. క్యాచ్ పట్టే సమయంలో కగిసో రబాడను గమనించాను. ఒకవేళ ఇద్దరం ఢీకొంటే ఎవరికి దెబ్బ తగిలేదో తెలీదు.. కానీ, బంతి కచ్చితంగా పట్టుకోవాలని అనుకున్నాను. బంతిని ఒడిసిపట్టుకోవడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. అనుకున్నట్లుగానే క్యాచ్‌ను అందుకున్నాను. ఫీల్డింగ్‌లో ఎటు వెళ్లినా బంతి నా దగ్గరికే వచ్చింది. కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. కానీ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని జట్టు విజయంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ పరిస్థితి ఎదురైనా దానికి తగ్గట్లుగా ఆడి జట్టును గెలిపించడమే నా లక్ష్యం' అని జేసన్ హోల్డర్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
మహిళలు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల అరెస్ట్!
జేసన్ హోల్డర్ క్యాచ్ వివాదం.. అంపైర్‌పై కోహ్లీ ఆగ్రహం!