ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్
ABN , Publish Date - May 01 , 2026 | 12:33 PM
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ మాత్రం మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు స్టార్ పేసర్ భువనేశ్వర్ మాత్రం మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో భువీ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. అంతేకాక ఐపీఎల్ చరిత్రలోనే తొలి బౌలర్ గా నిలిచాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
గుజరాత్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 28 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్ పేసర్ ఇషాన్ మలింగ(15 వికెట్లు)ను వెనక్కి నెట్టి భువీ(17 వికెట్లు) ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అలానే భారత గడ్డపై 200 ఐపీఎల్ వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్‌గా భువీ చరిత్ర సృష్టించాడు. 5వ ఓవర్లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేయడంతో ఈ ఫీట్‌ను సాధించాడు. తర్వాత స్థానంలో యజ్వేంద్ర చాహల్ ఉన్నాడు.
ఇక.. యుజ్వేంద్ర చాహల్ భారత్‌లో 154 ఐపీఎల్ మ్యాచ్‌లో 186 వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో చాహల్(228) టాప్ ప్లేసులో ఉండగా... రెండో స్థానంలో భువనేశ్వర్ కుమార్(215) కొనసాగుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు పుణే వారియర్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. సన్‌రైజర్స్ తరఫున వరుసగా రెండుసార్లు (2016, 2017) పర్పుల్ క్యాప్ గెలిచిన ఏకైక బౌలర్‌గా భువనేశ్వర్ నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
రజత్ పాటిదార్ ఔట్ వివాదం.. స్పందించిన జేసన్ హోల్డర్
మహిళలు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల అరెస్ట్!