Share News

ఆరెంజ్ జెర్సీలో నిలకడ.. ఓపెనింగ్ జోడీపై రహానే ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 09:40 PM

భారత టీ20 జట్టులో ఓపెనింగ్ స్థానంలో బీసీసీఐ చేస్తున్ ప్రయోగాలపై మాజీ క్రికెటర్ అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టు మేనేజ్‌మెంట్ నిలకడలేకుండా ప్రయోగాలు చేయడం సరికాదని వెల్లడించాడు.

ఆరెంజ్ జెర్సీలో నిలకడ.. ఓపెనింగ్ జోడీపై రహానే ఆసక్తికర వ్యాఖ్యలు
Ajinkya Rahane

స్పోర్ట్స్ డెస్క్: భారత టీ20 జట్టులో ఓపెనింగ్ స్థానంలో బీసీసీఐ చేస్తున్ ప్రయోగాలపై మాజీ క్రికెటర్ అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు చేశారు. జట్టు మేనేజ్‌మెంట్ నిలకడలేకుండా ప్రయోగాలు చేయడం సరికాదని, టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బ్యాటర్లకు అండగా నిలవాలని రహానే అభిప్రాయపడ్డాడు.


ఇటీవలి కాలంలో శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తదితరులు ఓపెనింగ్ స్థానం కోసం పోటీ పడ్డారు. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సైతం ఆ రేసులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైనా, జింబాబ్వేపై సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అందుకున్నాడు. అయితే, సంజూ శాంసన్‌ను పదేపదే జట్టులోకి తీసుకోవడం, విఫలమయ్యాక వెంటనే డ్రాప్ చేయడం పట్ల రహానే అసంతృప్తి వ్యక్తం చేశాడు.


'ప్రపంచకప్‌2026లో ఆడిన టాప్-3 బ్యాటర్లే ఈ జట్టులో కొనసాగాలి. సంజూ అద్భుతంగా రాణించినప్పటికీ, రెండు మూడు వైఫల్యాలతోనే జట్టు నుంచి తప్పించాడు. సంజూకి మరో అవకాశం ఇవ్వాలి. అభిషేక్, ఇషాన్ కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ సూర్యవంశీకి భవిష్యత్తులో బోలెడన్ని అవకాశాలు వస్తాయి. ప్రస్తుతానికి మాత్రం ప్రపంచకప్‌2026లో సత్తా చాటిన సంజూ, అభిషేక్, ఇషాన్‌లతో కూడిన టాప్-3నే సరైనది' అని రహానే తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.


త్వరలో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న సిరీస్ కోసం సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి రావడంపై రహానే హర్షం వ్యక్తం చేశాడు. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గెలుచుకున్న సంజూను ఇలా పక్కన పెట్టడం సరికాదన్నాడు. అనివార్య కారణాల వల్ల అతనికి అన్యాయం జరిగిందని, మ్యాచ్ విజేతైనా సంజూ పునరాగమనం జట్టును మరింత బలోపేతం చేస్తుందని రహానే విశ్వాసం వ్యక్తం చేశాడు. ఓపెనింగ్ సమస్యకు మేనేజ్‌మెంట్ శాశ్వత పరిష్కారం కనుగొని, సీనియర్లు, యువ ఆటగాళ్ల మధ్య సమతుల్యత పాటించాలని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Updated Date - Sep 11 , 2026 | 09:40 PM