శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా.. స్టార్ ప్లేయర్ గైర్హాజరు
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:43 PM
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లతో పాటు నలుగురు నెట్ బౌలర్లు లంక గడ్డపై అడుగుపెట్టారు.
స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు మంగళవారం సాయంత్రం కొలంబో చేరుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఆటగాళ్లతో పాటు నలుగురు నెట్ బౌలర్లు లంక గడ్డపై అడుగుపెట్టారు. అయితే, ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుండగా, జట్టుతో పాటు యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ శ్రీలంకకు చేరుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల ముగిసిన ‘ఇండియా-ఎ’ సిరీస్ సందర్భంగా సుదర్శన్ కాలికి గాయమైంది. ఫిట్‌నెస్ సాధిస్తేనే జట్టుకు అందుబాటులో ఉంటాడనే నిబంధనతో ఎంపికైన అతడు, చిన్నపాటి అసౌకర్యంతోనే ఇంకా కోలుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు. ఒకవేళ సుదర్శన్ లంక సిరీస్‌కు పూర్తిగా దూరమైతే, ఇటీవల ఇండియా-ఎ తరఫున చక్కగా రాణించిన మరో వికెట్ కీపర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్‌కు తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి:
రహానేకు దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు: సునీల్ గవాస్కర్
నా వల్లే మెక్‌కల్లమ్ కోచ్ పదవి పోయింది.. స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు