Share News

ఏపీ లిక్కర్‌ స్కాం.. A9 కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈనెల 18 వరకు రిమాండ్‌

ABN , Publish Date - Aug 04 , 2026 | 06:59 PM

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని కోర్టు ఈనెల 18 వరకు రిమాండ్‌కు పంపింది.

ఏపీ లిక్కర్‌ స్కాం.. A9 కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈనెల 18 వరకు రిమాండ్‌
AP Liquor Scam Kiran Kumar Reddy

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కాం కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ఏ9 నిందితుడిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్‌కు పంపింది. అనంతరం ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. మద్యం ముడుపుల నగదును షెల్‌ కంపెనీల ద్వారా తరలించినట్లు కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అధికారులు కీలక ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం.


2024 నుంచి విదేశాల్లో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి నిన్న శ్రీలంక నుంచి వస్తుండగా అతడిని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సిట్‌ అధికారులు విచారించి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, షెల్ కంపెనీల పాత్రపై సిట్‌ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


Also Read:

వైసీపీ నేతల సాగునీటి ప్రాజెక్టుల రక్షణ యాత్రపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్..

నీట్ పేపర్ లీక్ కేసు.. బీహార్‌లో మళ్లీ విద్యార్థుల ఆందోళనలు

Updated Date - Aug 04 , 2026 | 07:01 PM