మరో రెండ్రోజుల్లో అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హోర్ముజ్ జలసంధి తెరుచుకునే అవకాశం..
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:03 PM
ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకునే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకునే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌తో ఒప్పందం ఈరోజు లేదా రేపు కుదిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఈ ఒప్పందం కుదిరితే హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు (US Iran Deal).
'మేము ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నాము. హోర్ముజ్ జలసంధిని తెరిచి మరింత సాధారణ స్థితికి చేరుకోవడానికి ఈ రోజు లేదా రేపు ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ఈ ఒప్పందం వ్యూహాత్మక జలమార్గం గుండా స్వేచ్ఛా రాకపోకలకు తిరిగి అవకాశం కల్పిస్తుంది' అని ఆయన అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు (Scott Bessent about Strait of Hormuz).
బెసెంట్ వ్యాఖ్యలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో వెంటనే స్పందన కనిపించింది (Global Oil Prices). హోర్ముజ్ మార్గం తిరిగి తెరుచుకుంటుందనే ఆశలతో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను ఖండించింది. తాము ఒమాన్‌తో సముద్ర మార్గాలకు సంబంధించిన అంశాలపైనే చర్చిస్తున్నామని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..