18 ఏళ్లకే ప్రొఫెసర్.. 306 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన నాథన్ థామస్..
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:55 PM
సాధారణంగా 18 ఏళ్ల వయసులో ఎవరైనా ఉన్నత విద్యలో అడుగుపెడుతుంటారు. కానీ అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ మాత్రం 18 ఏళ్ల వయసులో కళాశాల ప్రొఫెసర్‌గా మారి చరిత్ర సృష్టించాడు.
సాధారణంగా 18 ఏళ్ల వయసులో ఎవరైనా ఉన్నత విద్యలో అడుగుపెడుతుంటారు. కానీ అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ (Nathan Thomas) మాత్రం 18 ఏళ్ల వయసులో కళాశాల ప్రొఫెసర్‌గా మారి చరిత్ర సృష్టించాడు. కేవలం 18 సంవత్సరాల 346 రోజుల వయసులో అధ్యాపకుడిగా మారి, ప్రపంచంలోనే అతి పిన్న వయసు పురుష ప్రొఫెసర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. 306 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును బద్దలు కొట్టాడు (Youngest Professor).
1717లో స్కాట్లాండ్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త కొలిన్ మెక్‌లారిన్ 19 ఏళ్ల వయసులో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఎవరూ ఆ స్థాయి ప్రతిభ ప్రదర్శించలేకపోయారు. ఇప్పుడు నాథన్ థామస్ ఆ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు. నాథన్ కేవలం 10 ఏళ్లకే మియామి డేడ్ కాలేజీలో డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమం ద్వారా కళాశాల చదువు ప్రారంభించాడు. అనంతరం ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలను పూర్తి చేశాడు (Guinness World Records).
ఆ తర్వాత తాను చదివిన మియామి డేడ్ కాలేజీలోనే ఇంజినీరింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరి విద్యార్థులకు బోధించడం ప్రారంభించాడు. తనతో సమాన వయసు ఉన్న విద్యార్థులకు బోధిస్తున్నాడు. తరగతి గదిలో వయసు కంటే నేర్చుకోవాలనే ఆసక్తే ముఖ్యమని నాథన్ పేర్కొన్నాడు. ప్రస్తుతం బోధనతో పాటు న్యాయశాస్త్రంలో కూడా ఉన్నత విద్య అభ్యసిస్తూ మేధో సంపత్తి (Intellectual Property) చట్టాల్లో నిపుణుడిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..