అహంకారానికి అంతం పతనమే.. విజయ్‌పై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు..
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:20 PM
త్రిషపై అభ్యంతకర వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్రిషపై అభ్యంతకర వ్యాఖ్యల కేసులో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అహంకారం చివరికి పతనానికే దారి తీస్తుందని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు (MK Stalin about Vijay).
ఉదయనిధి అరెస్టు చట్టపరమైన చర్య కాదని, కావేరి జలాల సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన రాజకీయ ప్రయత్నమని స్టాలిన్ ఆరోపించారు. ప్రభుత్వ అహంకారం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటి ధోరణి పతనాన్ని మరింత వేగవంతం చేస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశానికి ఒక రోజు ముందు ఈ అరెస్టు జరగడం, ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి దూరంగా ఉంచే ప్రయత్నమేనన్నారు (Trisha Remarks Case).
రాజకీయ విమర్శకులు, ప్రతిపక్ష నాయకులు, విద్యార్థులు, రైతులు, నిరసనకారుల గొంతు నొక్కడానికి టీవీకే ప్రభుత్వం పదేపదే అరెస్టులను ఉపయోగిస్తోందని డీఎంకే నాయకులు ఆరోపించారు (Udhayanidhi Stalin Arrest). త్రిషపై అసభ్యకర వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో నమోదైన కేసులో ఉదయనిధి స్టాలిన్‌ను చెన్నైలోని ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు. ఈ చర్య తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..