Share News

కేకేఆర్ కెప్టెన్‌గా రింకు సింగ్? ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు!

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:50 PM

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రింకు సింగ్‌తో సహా 17 మందిని రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కేకేఆర్ కెప్టెన్‌గా రింకు సింగ్? ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు!
Rinku Singh KKR Captain

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రింకు సింగ్‌తో సహా 17 మందిని రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేకేఆర్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌ను నియమించే అవకాశం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు.


ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘రింకు సింగ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా చేయాలనే చర్చ సుదీర్ఘంగా జరుగుతోంది. ప్రస్తుతం వారి జట్టులో నాయకత్వ పరంగా ఎక్కువ ఆప్షన్‌లు లేవు. ఉన్నవారిలో రింకు సింగ్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తున్నాడు. వేలం ద్వారా కెప్టెన్‌ను కొనుగోలు చేసే దిశగా కూడా కేకేఆర్ ఆలోచన చేస్తోంది. ఒకవేళ అదే జరిగితే వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ షై హోప్‌ను కోల్‌కతా దక్కించుకుని నాయకత్వ బాధ్యత అప్పగించే ఛాన్స్ ఉంది. కానీ, కేకేఆర్ యాజమాన్యం వ్యవహరించే తీరును బట్టి చూస్తే రింకు సింగ్ (Rinku Singh) కేకేఆర్ నూతన సారథి అవుతాడని నాకు అనిపిస్తోంది’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.


గత సీజన్‌లో కోల్‌కతాకు కెప్టెన్‌గా ఉన్న అంజిక్య రహానె ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు కొత్త సారథిని నియమించడంపై కేకేఆర్ ఫ్రాంచైజీ దృష్టిపెట్టింది. డిసెంబరు 16న గోవాలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. భారత మాజీ ఆకాశ్‌ చోప్రా కూడా రింకు సింగ్‌కే కేకేఆర్ పగ్గాలు అప్పగించే అవకాశముందన్నాడు. రూ.25.20 కోట్ల ధరతో ఉన్న కామెరూన్‌ గ్రీన్‌ను కేకేఆర్‌ రిలీజ్‌ చేయకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.


ఇవి కూడా చదవండి:

విశాఖలో బస్సు ప్రమాదం.. విద్యార్థులకు గాయాలు

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే కీలకం: హోంమంత్రి అనిత

Updated Date - Nov 28 , 2026 | 06:51 PM