Share News

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే కీలకం: హోంమంత్రి అనిత

ABN , Publish Date - Nov 28 , 2026 | 04:19 PM

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే కీలకమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈనెల 30న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది.

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే కీలకం: హోంమంత్రి అనిత
Home Minister Anitha

అమరావతి, నవంబర్ 28: మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యమే కీలకమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈనెల 30న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. మహిళా సాధికారత కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకూడదన్నారు. రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించినప్పుడే నిజమైన సాధికారత అని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు.


ఏపీలో మహిళా నాయకత్వానికి సర్కార్ బాటలు వేసిందని హోంమంత్రి అన్నారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ల దిశగా కేంద్రం మరో అడుగు వేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాల్లో మహిళలు భాగస్వాములుగా మాత్రమే కాకుండా నిర్ణయాధికారులుగా ఎదగాలన్నారు. ‘మహిళలు మార్పులో భాగం కావాలి.. మార్పుకు మార్గదర్శకులు కావాలి’ అంటూ ఎక్స్‌లో హోంమంత్రి అనిత పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

కొమెరపూడిలో ఓటర్లకు బెదిరింపులు.. అప్పు చెల్లించాలంటూ వైసీపీ నేతల హుకుం

నంది టీవీ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఏర్పాటు.. ఛైర్మన్‌ ఎవరంటే?

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 04:37 PM