Share News

అఖిలేష్ రామమందిర పర్యటన.. యూపీ సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:44 PM

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య రామమందిరం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ డిసెంబర్ 12న అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అఖిలేష్ రామమందిర పర్యటన.. యూపీ సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు..
Yogi Adityanath

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య రామమందిరం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ డిసెంబర్ 12న అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిలేశ్ యాదవ్ తమ రాజకీయ పిచ్‌పైకి వచ్చి ఆడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే అయోధ్యకు వెళ్లే ముందు కరసేవకులపై కాల్పుల ఘటనకు సంబంధించి హిందువులకు క్షమాపణ చెప్పాలని సూచించారు (Yogi Adityanath about Akhilesh Yadav).


రామమందిర ఉద్యమాన్ని గతంలో వ్యతిరేకించిన వారే ఇప్పుడు అయోధ్యకు వెళ్లాలని అనుకోవడం ఆసక్తికరమని సీఎం యోగి అన్నారు. 1990లో అయోధ్యలో రామమందిర నిర్మాణ ఉద్యమం సందర్భంగా కరసేవకులపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనను యోగి ప్రస్తావించారు. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందని పేర్కొన్నారు. రామమందిరం కోసం నినాదాలు చేసిన కరసేవకులపై లాఠీచార్జి, కాల్పులు జరిగాయని ఆరోపించారు. అయోధ్య రామమందిరాన్ని సందర్శించాలనుకుంటే ముందుగా ఆ ఘటనకు సంబంధించి రామభక్తులకు అఖిలేశ్ క్షమాపణ చెప్పాలని యోగి డిమాండ్ చేశారు (Akhilesh Ayodhya Visit).


ఇటీవల అఖిలేశ్ యాదవ్ గొరఖ్‌పూర్ పర్యటనను కూడా యోగి ప్రస్తావించారు (Uttar Pradesh Politics). బుల్డోజర్ గురించి మాట్లాడటం సులభమే కానీ దాన్ని నడపాలంటే ప్రత్యేకమైన సంకల్పబలం ఉండాలని వ్యాఖ్యానించారు. బుల్డోజర్ స్టీరింగ్ పట్టుకోవడం అందరికీ సాధ్యం కాదంటూ అఖిలేశ్‌పై విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వారణాసి శాశ్వతమైన నగరమని, భారత రాజకీయాల్లో బీజేపీ కూడా శాశ్వతమైన రాజకీయ శక్తిగా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు..


ఇది దక్షిణాది రాష్ట్రాల విజయం.. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ కీలక ప్రకటన..

Updated Date - Nov 28 , 2026 | 05:44 PM