Share News

మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Nov 28 , 2026 | 02:39 PM

నారీశక్తికి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్‌తో పాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని తొలగిస్తామని భరోసా ఇచ్చారు.

మహిళా రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదు.. ప్రధానమంత్రి మోదీ కీలక వ్యాఖ్యలు..
PM Modi

ఇంటర్నెట్ డెస్క్: నారీశక్తికి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్‌తో పాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని తొలగిస్తామని భరోసా ఇచ్చారు. మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మోదీ 'ఎక్స్' ద్వారా ఈ ప్రకటన చేశారు (PM Modi about Women's Reservation Bill).


మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ముందడుగు వేస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్న పోరాటం దశాబ్దాలుగా కొనసాగుతోందని మోదీ పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధన కోసం తాను కూడా ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నానని తెలిపారు. దేశంలోని అనేక మంది మహిళలు ఈ అంశంపై తనకు లేఖలు రాశారని, వ్యక్తిగతంగా కూడా తమ ఆకాంక్షలను వెల్లడించారని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కొత్త బిల్లులను నవంబరు 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చకు తీసుకురానున్నారు (33% Women Reservation).


లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు కేటాయించేందుకు 2023లో నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలనే నిబంధన ఉంది (Delimitation Bill). ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. తాజాగా కేంద్ర మంత్రివర్గం 132వ రాజ్యాంగ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రెండో బిల్లుకు ఆమోదం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!

కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి

Updated Date - Nov 28 , 2026 | 03:00 PM