Share News

ఇది దక్షిణాది రాష్ట్రాల విజయం.. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ కీలక ప్రకటన..

ABN , Publish Date - Nov 28 , 2026 | 03:29 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడించారు.

ఇది దక్షిణాది రాష్ట్రాల విజయం.. డీలిమిటేషన్ బిల్లుపై స్టాలిన్ కీలక ప్రకటన..
MK Stalin

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలన్న తమ పోరాటానికి ఫలితం దక్కిందని పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని దక్షిణాది రాష్ట్రాల విజయంగా అభివర్ణించారు. శనివారం చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన డీఎంకే ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు (DMK Delimitation Bill).


అనంతరం పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఏ. రాజా మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుత లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనకు డీఎంకే మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలో బిల్లును వ్యతిరేకించడానికి కారణమైన రెండు ప్రధాన డిమాండ్లను కేంద్రం తాజా ప్రతిపాదనలో లిఖితపూర్వకంగా చేర్చిందని స్టాలిన్ తెలిపారు. 2024 నుంచి డీఎంకే కొనసాగిస్తున్న పోరాటానికి ఇది విజయమని స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. తమిళనాడుతో పాటు అన్ని దక్షిణాది రాష్ట్రాలకు ఈ పరిణామం ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు (Southern States).


డీలిమిటేషన్ బిల్లు అంశంపై ప్రజలు భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఆలోచించాలని సూచించారు (Tamil Nadu Politics). సవరించిన బిల్లును వ్యతిరేకిస్తే అన్ని రాష్ట్రాలకు 50 శాతం అదనపు లోక్‌సభ స్థానాలు కల్పించే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మద్దతు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించడం ప్రతిపక్ష కూటమిలో చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పూజ చేసి నీ కూతురి మనసు మార్చేస్తాం..!!

కాలేజీల సమీపంలోనే పరీక్షా కేంద్రాలు ఉండాలి

Updated Date - Nov 28 , 2026 | 03:29 PM