Share News

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..

ABN , Publish Date - May 13 , 2026 | 08:34 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..
RCB Vs SRH

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. రాయ్‌పూర్‌ వేదికగా మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన బెంగళూరు.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయనుంది. పాయింట్స్ టేబుల్‪లో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్ ప్లేస్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. అలానే ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన నాలుగు విజయాలతో ఉన్న కోల్‌కతాకు ఇక నుంచి జరిగే మ్యాచ్‌లన్నీ చావో రోవో లాంటివి. ప్లే ఆఫ్ రేసులో ఉండాలంటే ఆ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాలి.


తుది జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ :

అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, మనీశ్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి

ఇంపాక్ట్ సబ్‌లు: సౌరభ్ దూబే, రమణదీప్ సింగ్, తేజస్వి దహియా, నవదీప్ సైనీ, టిమ్ సీఫెర్ట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

జాకబ్ బెతెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం దార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్‌వుడ్

ఇంపాక్ట్ సబ్‌లు: దేవదత్ పడిక్కల్, జోర్డాన్ కాక్స్, మంగేష్ యాదవ్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Updated Date - May 13 , 2026 | 09:52 PM