Share News

టీ20 ప్రపంచ కప్ 2026: జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

ABN , Publish Date - May 13 , 2026 | 02:57 PM

త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్‌‌ను ఆసీస్ బోర్డు ఎంపిక చేసింది.

టీ20 ప్రపంచ కప్ 2026: జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
Australia Women's T20 World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా జట్టును ఇవాళ(బుధవారం) ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్‌‌ను ఆసీస్ బోర్డు ఎంపిక చేసింది. అలానే ఆష్లే గార్డ్‌నర్‌ వైస్ కెప్టెన్‌‌గా ఎంపికైంది. ఎల్లిస్‌ పెర్రీ, బెత్‌ మూనీ, తాలియా మెక్‌గ్రాత్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.


గతంతో పోలిస్తే భిన్నంగా ఈ సారి సెలెక్టర్లు స్పిన్ బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా జార్జియా వేర్హమ్‌, అలానా కింగ్‌ వంటి స్పిన్నర్లను ఎంపిక చేశారు. ఫాస్ట్‌ బౌలర్ డార్సీ బ్రౌన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఆమె స్థానంలో 20 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లూసీ హామిల్టన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశం ఇచ్చింది. డబ్ల్యూపీఎల్‌ ఫ్రాంచైజీ ఆర్సీబీకి చెందిన ముగ్గురు కీలక ప్లేయర్లకు ఈ ఆసీస్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కడం గమనార్హం. హ్యారిస్‌,పెర్రీ, సోఫీలు గతంలో డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆడారు.


జూన్‌ 12 నుంచి జులై 5 వరకు జరిగే ప్రపంచకప్‌లో గ్రూప్-1లో ఆస్ట్రేలియా, భారత్‌, సౌతాఫ్రికా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ వంటి పటిష్ఠమైన జట్లు ఉన్నాయి. జూన్ 13న మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, పాకిస్థాన్‌, భారత్‌తో గ్రూప్ దశలో తలడనుంది. జూన్ 28న లార్డ్స్ మైదానంలో భారత్‌తో జరిగే మ్యాచ్‌పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఆస్ట్రేలియా ప్రపంచ కప్ జట్టు:

సోఫీ మోలినెక్స్ (కెప్టెన్), ఆష్లే గార్డ్‌నర్ (వైస్ కెప్టెన్), తాలియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), నికోలా క్యారీ, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ (వికెట్ కీపర్), ఎలీస్ పెర్రీ, మేగన్ షట్, అన్నబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హామ్. రిజర్వ్: తాలియా విల్సన్ (వికెట్ కీపర్).


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌కు ముందు సీఎస్కేలో కీలక మార్పు!

నెట్స్‌లో అర్ధరాత్రి ప్రాక్టీస్ చేసిన హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్

Updated Date - May 13 , 2026 | 07:17 PM