ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు జరిమానా
ABN , Publish Date - May 13 , 2026 | 01:18 PM
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో జీటీపై ఎస్ఆర్‌హెచ్ 82 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది.
‘ఈ సీజన్‌లో ఓవర్ రేట్ నిబంధనల ఉల్లంఘన కింద ఇది ఎస్ఆర్‌హెచ్ చేసిన తొలి తప్పిదం. అందుకే కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధించాం’ అని మ్యాచ్ అనంతరం ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మ్యాచ్ మొత్తం 34.5 ఓవర్లలోనే ముగిసినా స్లో ఓవర్ రేట్ కారణంగా చర్యలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 168 పరుగులు చేసింది. 169 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన ఎస్ఆర్‌హెచ్ పూర్తిగా తేలిపోయింది. రబాడా, హోల్డర్, సిరాజ్ విజృంభించిన వేళ.. 86 పరుగులకే హైదరాబాద్ జట్టు కుప్పకూలింది. విధ్వంసకర బ్యాటర్లంతా విఫలమైన వేళ.. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఐదో ఓటమిని చవి చూసింది. దీంతో 14 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది.
ఇది అత్యుత్తమ బౌలింగ్: కమిన్స్
మ్యాచ్ అనంతరం జట్టు ఓటమిపై కమిన్స్ మాట్లాడాడు. ‘అహ్మదాబాద్ పిచ్‌ను అంచనా వేయలేకపోయాం. పిచ్ చాలా కఠినంగా ఉంది. బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతులు బాగా పనిచేశాయి. వాళ్లు మాకు పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదు. మేము కూడా అదే లెంగ్త్‌ను ఇంకాస్త ప్రయోగించి ఉంటే బాగుండేది అనిపించింది. ఛేదనలో గుజరాత్ బౌలర్లు అద్భుతంగా ఆడారు. టీ20ల్లో చూడగలిగే అత్యుత్తమ బౌలింగ్ ఇదే అనిపించింది. దూకుడుగా ఆడే మా బ్యాటింగ్ యూనిట్‌కు ఇది కలిసి రాని రోజు. తర్వాతి మ్యాచ్‌లో బలంగా తిరిగొస్తాం’ అని కమిన్స్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్‌కు ముందు సీఎస్కేలో కీలక మార్పు!
నెట్స్‌లో అర్ధరాత్రి ప్రాక్టీస్ చేసిన హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్