సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ABN , Publish Date - May 13 , 2026 | 04:02 PM
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 82 పరుగుల తేడాతో దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక కామెంట్స్ చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 82 పరుగుల తేడాతో దారుణ ఓడిన సంగతి తెలిసిందే. గుజరాత్ విధించిన 169 పరుగులను ఛేదించే క్రమంలో ఆరెంజ్ ఆర్మీ 86 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక కామెంట్స్ చేశారు. ట్రాఫిక్‌లో కూడా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తామంటే.. ప్రమాదం జరుగుతుందని ఎస్ఆర్‌హెచ్ జట్టు అదే పని చేసిందని వ్యాఖ్యానించాడు.
ఎస్ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ ప్రదర్శనను కారు డ్రైవింగ్‌తో పోల్చాడు. అభిషేక్ బ్యాటింగ్ విధానం గురించి ఈ మాజీ ప్లేయర్ మాట్లాడుతూ.. 'ఆ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్(అభిషేక్ శర్మ) హైవేపై ఎంత వేగంతో డ్రైవ్ చేస్తాడో, ట్రాఫిక్‌లో కూడా అంతే వేగంతో డ్రైవ్ చేస్తున్నాడు. మీరు హైవేపై గంటకు 100 లేదా 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. కానీ ట్రాఫిక్ జామ్‌లో కూడా అలా నడిపితే, ఎవరో ఒకరు గాయపడతారు. క్రికెట్ అనేది కూడా పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సిన ఆట. అభిషేక్ శర్మ ఒక బంతికి ఒకే పరుగులు తీసి.. ఓ మంచి భాగస్వామ్యాన్ని నిర్మించడం నేను చూడాలనుకుంటున్నాను' అని తెలిపాడు.
ప్రపంచంలోని స్టార్ ఆటగాళ్లందరూ ఎల్లప్పుడూ పిచ్ పరిస్థితులకు తగినట్లుగా తమ ఇన్నింగ్స్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటారో, విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ వంటి వారిని అభిమానులు ఎందుకు ప్రేమిస్తారో, గౌరవిస్తారో ఈ సీనియర్ క్రికెటర్ వివరించాడు. 'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు పిచ్ పరిస్థితులను అంచనా వేసి.. అందుకు అనుగుణంగా మారతారు కాబట్టే ప్రశంసలు అందుకుంటారు. వారు అన్ని రోడ్లపైనా ఒకే వేగంతో డ్రైవ్ చేయరు. గుజరాత్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ లక్ష్యాన్ని ఛేజ్ చేయాల్సింది, కానీ టాప్ త్రీ బ్యాటర్లు బాధ్యత తీసుకోకపోవడంతో ఓటమి పాలయ్యారు' అని అశ్విన్ విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
ఐపీఎల్ 2026: సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు జరిమానా