సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 13 , 2026 | 03:06 PM
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. 85 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్నెట్ డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. 85 శాతానికి పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 3 శాతం తగ్గింది. ఈసారి 88 శాతం బాలికలు, 82 శాతం బాలురు ఉతీర్ణులయ్యారు. విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ నంబర్ వివరాలతో www.cbse.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు.
ఫలితం ఇలా చూసుకోవచ్చు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల కోసం, విద్యార్థులు ముందుగా అధికారిక సీబీఎస్ఈ వెబ్‌సైట్ cbse.gov.in లేదా results.cbse.nic.in ను సందర్శించాలి. ఆ తర్వాత, హోమ్‌పేజీలోని 'CBSE 12th Result 2026' అనే లింక్‌పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నంబర్, పాఠశాల నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీ వంటి అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత వెంటనే ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. విద్యార్థులు తమ మార్క్‌షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. పరీక్ష రాసిన విద్యార్ధులు డిజిలాకర్, ఉమాంగ్ యాప్ ద్వారా కూడా తమ మార్క్‌షీట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి...
టెక్నాలజీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై
అనధికార లౌడ్‌స్పీకర్లపై డీజీపీకి రఘురామ లేఖ