Share News

జ్యోతిష్యుడి విషయంలో సీఎం విజయ్ యూటర్న్

ABN , Publish Date - May 13 , 2026 | 01:42 PM

ఓఎస్‌డీగా జ్యోతిష్యుడి నియామకంపై తమిళనాడు ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆయన నియామకంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

జ్యోతిష్యుడి విషయంలో సీఎం విజయ్ యూటర్న్
TN OSD Appointment Revoked

ఇంటర్నెట్ డెస్క్: జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ విషయంలో తమిళనాడు సీఎం విజయ్ వెనక్కు తగ్గారు. ఆయనను తన ఓఎస్‌డీగా నియమిస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఒక జ్యోతిష్యుడిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించడం ఏమిటని ప్రతిపక్షాలు, మిత్రపక్షాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీఎం విజయ్ వెనక్కు తగ్గారు. వెట్రివేల్‌‌కు గతంలో ఇచ్చిన నియామక ఉత్తర్వులను రద్దు చేసినట్టు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.


తాజాగా అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో సీఎం విజయ్ నెగ్గిన విషయం తెలిసిందే. అయితే, విశ్వాస పరీక్షకు ముందు వీసీకే ఎమ్మెల్యే వాణి అర్సు ఓఎస్‌డీ అంశాన్ని లేవనెత్తారు. శాస్త్రీయత, తార్కిక ఆలోచనా ధోరణితో ముందుకు సాగాలని అన్నారు. మూఢనమ్మకాలను పక్కనపెట్టాలని చెప్పారు. ‘మన ప్రభుత్వం జ్యోతిష్యానికి కాక శాస్త్రీయ దృక్పథానికి ప్రాధాన్యం ఇవ్వాలి’ అని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాధన్ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నామని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

నీట్ ప్రశ్నాపత్రం లీక్.. స్పందించిన అరవింద్ కేజ్రీవాల్

సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడు దిలీప్ రాజ్ మృతి..

Updated Date - May 13 , 2026 | 03:02 PM