నీట్ ప్రశ్నాపత్రం లీక్.. స్పందించిన అరవింద్ కేజ్రీవాల్
ABN , Publish Date - May 13 , 2026 | 01:34 PM
నీట్ యూజీ ప్రశ్నాపత్రం మరోసారి లీక్ కావడంపై ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ ప్రశ్నాపత్రం లీక్ కావడంపై బుధవారం న్యూఢిల్లీలో ఆయన స్పందించారు.
న్యూఢిల్లీ, మే13: నీట్ యూజీ ప్రశ్నాపత్రం మరోసారి లీక్ కావడంపై ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ ప్రశ్నాపత్రం లీక్ కావడంపై బుధవారం న్యూఢిల్లీలో ఆయన స్పందించారు. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి నేటి వరకు 93 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయన్నారు. వీటిలో అత్యధిక సార్లు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన వివరించారు.
అత్యధిక పేపర్ లీక్ ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలోనే జరిగాయన్నారు. తాజాగా నీట్ పేపర్ లీక్‌కు రాజస్థాన్ కేంద్ర బిందువుగా ఉందని తమకు నివేదికలు అందుతున్నాయని చెప్పారు. ఈ పేపర్ లీకు కారణంగా దాదాపు ఆరు కోట్ల మంది యువత నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక అనుమానాన్ని రేకెత్తిస్తోందన్నారు.
ఈ పేపర్ లీక్‌లో ఆ పార్టీ నాయకుల ప్రమేయం ఉందా? అంటూ అరవింద్ కేజ్రీవాల్ సందేహం వ్యక్తం చేశారు. ఒకవేళ అదే నిజమైతే, కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఏం చేయగలదు? అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. నేపాల్, బంగ్లాదేశ్‌లలోని జెన్ - జెడ్ రహదార్లపైకి వచ్చి.. వారి ప్రభుత్వాలను మార్చగలిగినప్పుడు, మన జెన్ - జెడ్ పేపర్ లీక్ ఘటనలలో ప్రమేయం ఉన్న మంత్రులను జైలుకు పంపలేరా? అని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియాగాంధీకి మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
అల్లు అర్జున్‌నే వదల్లేదు బండి భగీరథ్‌ను ఎందుకు వదిలేస్తాం: కాంగ్రెస్ నేత
Read Latest National News And Telugu News