Share News

ఇషాన్ కిషన్‌తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలి: రవిశాస్త్రి

ABN , Publish Date - Mar 04 , 2026 | 02:48 PM

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ఇషాన్‌ కిషన్‌తో ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేయించాలని తెలిపాడు.

ఇషాన్ కిషన్‌తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలి: రవిశాస్త్రి
Ravi Shastri comments

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026)లో భాగంగా రేపు(గురువారం) ముంబై వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇదే సమయంలో టీమిండియా టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే అతడు బ్యాట్‌తో అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ఇషాన్‌ కిషన్‌తో ఇన్నింగ్స్‌ ఓపెనింగ్ చేయించాలని, తుదిజట్టులో రింకు సింగ్‌ను తీసుకోవాలని అన్నాడు.


ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి(Ravi Shastri) మాట్లాడుతూ... గురువారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు అభిషేక్‌ శర్మను కొనసాగించాలని, మానసికంగా ఇబ్బందిపడుతుండటం వల్లే అతడు పెద్దగా స్కోర్లు చేయలేకపోతున్నాడని అన్నాడు. గతంలో అభిషేక్ ఇంగ్లండ్‌ సిరీస్‌లో అద్భుతంగా రాణించన సంగతి మనందరం గుర్తు చేసుకోవాలని తెలిపాడు. అతడు సెమీ ఫైనల్‌లో రాణిస్తాడనే నమ్మకం తనకు ఉందని రవిశాస్త్రి వెల్లడించాడు. అలానే ఇషాన్‌ కిషన్‌తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలని, అలాగే తుది జట్టులోకి రింకు సింగ్‌ను తీసుకుని లోయర్‌ ఆర్డర్‌లో అతడికి అవకాశం ఇవ్వాలని రవిశాస్త్రి సూచించాడు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఆయన తెలిపాడు.


గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన 5 టీ20 మ్యాచ్‌లో సిరీస్‌లో అభిషేక్‌ శర్మ భారీ సెంచరీ (135) బాదాడు. అలాగే టీ20ల్లో భారత క్రికెటర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ యువ హిట్టర్.. అనూహ్యంగా ఈ ఐసీసీ టోర్నీలో విఫలమవుతూ వస్తున్నాడు. ఇదే సమయంలో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఏడు మ్యాచులు ఆడి.. 224 పరుగులు చేశాడు. సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సంజు శాంసన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.


ఇవి కూడా చదవండి:

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి జరిమానా.. ఎందుకంటే...

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన పాండ్య..

Updated Date - Mar 04 , 2026 | 02:55 PM