అక్కడ '24 క్యారెట్' పిచ్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండవు: అశ్విన్
ABN , Publish Date - Jun 29 , 2026 | 09:12 PM
ఐర్లాండ్ చేతిలో 2-0 తేడాతో భారత్ ఓటమి పాలుకావడంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు భారత బ్యాటర్లు ఐర్లాండ్ సిరీస్ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 మ్యాచుల సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఘోరంగా ఓడింది. దీంతో టీమిండియా అభిమానులు తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. పసికూన ఐర్లాండ్‌తో బలమైన భారత్ ఓడిపోవడంతో అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమిపై పలువురు మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు భారత బ్యాటర్లు ఐర్లాండ్ సిరీస్ నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాడు.
తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ... 'ఐపీఎల్‌లో టీమిండియా బ్యాటర్లు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లపై ఆడి అలాంటి ఆటకు అలవాటు పడ్డారు. విదేశాల్లో బౌలర్లకు సహకరించే మైదానాల్లో ఆడాల్సి వచ్చినప్పుడు అది వారికి పెద్ద సవాలుగా మారుతోంది. ఐపీఎల్‌లో మాదిరిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన 24 క్యారెట్ల పిచ్‌లు విదేశాల్లో ఉండవు. ఐపీఎల్ కారణంగా మన బ్యాటింగ్ బలపడింది. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బౌలర్లకు అనుకూలంగా ఉండే పిచ్‌లపై వారి సామర్థ్యానికి పెద్ద పరీక్ష ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది' అని అశ్విన్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఒలింపిక్స్2028... టీమిండియా అభిమానులకు శుభవార్త!
భారత్‌పై చరిత్రాత్మక విజయం.. ఐర్లాండ్ కోచ్ సంచలన నిర్ణయం