Share News

అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పు..

ABN , Publish Date - Jun 29 , 2026 | 08:53 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో తాత్కాలిక మార్పులు చేసింది. బీఎల్‌ఓ విధులు ఉన్న కేంద్రాలు జూన్ 29 నుంచి జులై 28 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అంగన్‌వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పు..
AP Anganwadi Timings

అమరావతి: ఎన్నికల సంబంధిత విధుల్లో అంగన్‌వాడీ టీచర్లు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు వెసులుబాటు కల్పిస్తూ, ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పని వేళలను తాత్కాలికంగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.


ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, బీఎల్‌ఓ విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు ఉన్న కేంద్రాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ మార్పులు జూన్ 29 నుంచి జూలై 28 వరకు అంటే నెల రోజుల పాటు అమల్లో ఉంటాయి.


Also Read:
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం..

Updated Date - Jun 29 , 2026 | 08:55 PM