Share News

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 08:11 PM

తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగులు ఇచ్చింది.

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
Telangana IPS Transfers 2026

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో ఐపీఎస్, ఎస్‌పీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు చేపట్టింది. ఈ మేరకు జీఓ ఆర్.టి. నెం.931ను జారీ చేసింది. పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించగా, మరికొందరికి అదనపు బాధ్యతలు కేటాయించింది.


  • రామగుండం పోలీస్ కమిషనర్‌గా కొనసాగుతున్న అంబర్ కిశోర్ ఝాకు డీఐజీ, జోన్-1 (కాళేశ్వరం) అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్‌కు డీఐజీ, జోన్-5 (యాదాద్రి) బాధ్యతలు కూడా అప్పగించారు.

  • వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సున్‌ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ, డీఐజీ జోన్-3 (రాజన్న) అదనపు బాధ్యతలు ఇచ్చారు.

  • హైదరాబాద్ నార్త్ రేంజ్ (లా అండ్ ఆర్డర్) జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఎన్. శ్వేతను వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ, డీఐజీ జోన్-4 (భద్రాద్రి) బాధ్యతలు కూడా అప్పగించారు.


  • ఇంటెలిజెన్స్ సీఐ సెల్ డీఐజీగా కొనసాగుతున్న ఆర్. భాస్కరన్‌కు జోన్-2 (బాసర) డీఐజీ అదనపు బాధ్యతలు కేటాయించారు. స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్‌కు హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న చి. సింధు శర్మను ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఎస్పీగా బదిలీ చేసి, ఎస్‌ఐబీ ఎస్పీ బాధ్యతలు కూడా అప్పగించారు. ఎస్‌ఐబీ ఎస్పీగా ఉన్న వై. సాయి శేఖర్‌ను సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఎస్పీగా బదిలీ చేశారు.

  • హైదరాబాద్ డీసీపీ (ఎస్‌ఎం అండ్ ఐటీ)గా ఉన్న చెన్నూరి రూపేష్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ చి. ప్రవీణ్ కుమార్లను సీఐడీ ఎస్పీలుగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆర్. వెంకటేశ్వర్లును హైదరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీగా నియమించారు.

  • వనపర్తి అదనపు ఎస్పీ (అడ్మిన్)గా ఉన్న రాజేష్ మీనాను వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా ఉన్న బి. రాములు నాయక్‌‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

వ్యాధుల కాలం.. జర పైలం

Updated Date - Jun 29 , 2026 | 08:23 PM