బాబర్‌కు వారి గతే పట్టొచ్చు.. మాజీ పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:36 PM
పాకిస్థాన్ క్రికెట్‌లో సంక్షోభం నెలకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటములు చవిచూసిన తర్వాత ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బందిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్‌లో సంక్షోభం నెలకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటములు చవిచూసిన తర్వాత ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బందిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ పతనావస్థకు చేరడానికి ప్రధాన కారణం పీసీబీనేని మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలువురి ప్లేయర్లను తొలగించిన పాక్ బోర్డు తర్వాతి టార్గెట్.. కెప్టెన్ బాబర్ ఆజామే అంటూ మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ రషీద్ లతీఫ్ సంచలన కామెంట్స్ చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజాంతో సహా జట్టును పీసీబీ రిమోట్ కంట్రోల్‌తో నడుపుతోందని లతీఫ్ ఆరోపించాడు.
'పీసీబీ జట్టును ‘రిమోట్ కంట్రోల్’ ద్వారానే నడపాలని అనుకుంటున్నట్లు ఉంది. సర్ఫరాజ్, ఉమర్ గుల్‌ను ఎందుకు ఇంగ్లండ్‌కు పంపారు? ఆ ఇద్దరిని ఎందుకు వెనక్కి పిలిచారు? గ్యారీ కిరిస్టెన్, జాసన్ గిలెస్పీ నుంచి అధికారాలను ఎందుకు తొలగించారు? మీ(పీసీబీ) నిర్ణయాలు ఏంటో అర్థం కావడం లేదు. కెప్టెన్ బాబర్ మీ మాట వినకపోతే అతడిని తొలగించి ఉండాల్సింది కదా..! అలా కాకుండా సర్ఫరాజ్, ఉమర్‌పై వేటు ఎందుకు? వీరి తర్వాత మీ టార్గెట్ బాబర్ ఆజామేనా?’ అని లతీఫ్ ఘాటుగా విమర్శిస్తూ పోస్టు పెట్టాడు.
అలానే పీసీబీతో పాటు కెప్టెన్ బాబర్ ఆజాంపై కూడా లతీష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేతిలో బలిపశువులైన ఆటగాళ్లు, కోచ్‌లకు సంఘీభావంగా కెప్టెన్ బాబర్ రాజీనామ చేయడం ఉత్తమం. స్క్వాడ్‌లోని సగం జట్టుపై వేటు వేయడం అంటే చిన్న విషయం కాదు. ఒకవేళ నేను బాబర్ స్థానంలో ఉండుంటే.. కెప్టెన్సీని వదిలేసేవాడిని. ఇప్పుడు నువ్వు (బాబర్) డమ్మీ సారథిగా మారావు. పాక్‌కు ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన కోచ్‌తో పాటు స్టార్ పేసర్‌నూ వెనక్కి పిలిపించారు. వారికి మద్దతుగా నిలవాల్సింది. కానీ మౌనంగా ఉన్నావు. పీసీబీకి నీలాంటి డమ్మీ కెప్టెన్ అవసరం ఎప్పుడూ ఉంటుంది’ అని లతీఫ్ విమర్శించాడు.
ఇవి కూాడా చదవండి:
పాక్‌తో మ్యాచ్.. స్మృతి మంధానని ఊరిస్తున్న ఆల్‌టైమ్ రికార్డు
టీచర్స్ డే.. ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సచిన్!