నిప్పులు చెరిగిన రషీద్ ఖాన్... 160 పరుగులకే కుప్పకూలిన బంగ్లా
ABN , Publish Date - Oct 21 , 2026 | 10:07 PM
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ బౌలర్లు విజృంభించారు. బంగ్లాదేశ్ జట్టు అఫ్ఘాన్ బౌలర్ల దాటికి 41.2 ఓవర్లలో కేవలం 160 పరుగులకే కుప్పకూలింది.
స్పోర్ట్స్ డెస్క్: ట్రై వన్డే సిరీస్‌లో భాగంగా షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అతడి బౌలింగ్ ధాటికి బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కి క్యూ కట్టారు. చివరకు బంగ్లా జట్టు 41.2 ఓవర్లలో కేవలం 160 పరుగులకే కుప్పకూలింది.
మ్యాచ్ విషయానికి వస్తే... టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారీ స్కోర్ చేయాలని భావించిన బంగ్లా 28 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఓ దశలో బంగ్లా జట్టు వంద పరుగులు చేయడం కూడా కష్టంగా కనిపించింది. ఈ సమయంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పర్వేజ్ హుస్సేన్ ఎమోన్ (70 పరుగులు) ఒంటరి పోరాటం చేశాడు. ప్రారంభంలో ఓపెనర్ సైఫ్ హసన్ (41 పరుగులు) కొంతసేపు క్రీజులో నిలదొక్కుకున్నాడు. సైఫ్ హసన్, పర్వేజ్ 93 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో బంగ్లా ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు సాధించకలిగింది.
ఇక అఫ్ఘాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలానే అజ్మతుల్లా ఒమర్జాయ్, యామిన్ అహ్మద్జాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా, ఈ టోర్నీలో అఫ్ఘానిస్థాన్ జట్టు ఇప్పటికే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్, జింబాబ్వే మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జింబాబ్వే తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది. బంగ్లా జట్టుపై 99 పరుగుల భారీ తేడాతో జింబాబ్వే విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
మూడు ఫార్మాట్లలో ఆడుతా.. నాపై ఆ ముద్ర వేయకండి: ప్రియాంశ్ ఆర్య
ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి అమిత్ మిశ్రా.. గంగూలీ, యువీలతో పాటు..!