Share News

నామినేషన్ల వేసే సమయంలో అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలి: ఎస్ఈసీ

ABN , Publish Date - Oct 21 , 2026 | 08:16 PM

రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 19 మున్సిపాలిటీలు మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో యథావిధిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.

నామినేషన్ల వేసే సమయంలో అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలి: ఎస్ఈసీ
AP SEC Anil Chandra Punetha

అమరావతి, అక్టోబర్ 21: రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 19 మున్సిపాలిటీలు మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో యథావిధిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల దాఖలుకు ఎన్‌వోసీ, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదుతో ఈ సర్టిఫికెట్లపై స్పష్టత ఇస్తున్నట్లు వివరించారు.


ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సమయంలో అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. అందుకోసం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలని సూచించారు.


ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రిటర్నింగ్ అధికారులు అదనపు నిబంధనలు విధించకూడదని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించారు.


రాష్ట్రంలోని ఏడు జిల్లాలోని 19 పురపాలక సంఘాలు, నగర పంచాయితీల్లో తమను నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారని అందువలన నామినేషన్ల గడువు పెంచాలంటూ సుప్రీంకోర్టును వైసీపీ ఆశ్రయించింది. ఈ పిటిషన్‌‌ను విచారించిన సుప్రీంకోర్టు.. నామినేషన్ గడువు పెంచేందుకు నిరాకరించింది. అయితే వైసీపీ చేసిన ఫిర్యాదులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా అధికారులకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

కేంద్ర నిధులను అడ్డుకునేందుకే వైసీపీ కుట్రలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

For More AP News And Telugu News

Updated Date - Oct 21 , 2026 | 08:42 PM