Share News

ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు: ఏపీ టీడీపీ చీఫ్ పల్లా

ABN , Publish Date - Oct 21 , 2026 | 09:03 PM

స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం వైసీపీకి లేదన్నారు. అందుకే కేసులు, వివాదాలతో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.

ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు: ఏపీ టీడీపీ చీఫ్ పల్లా
AP TDP Chief Palla Srinivasa rao

అమరావతి, అక్టోబర్ 21: స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం వైసీపీకి లేదన్నారు. అందుకే కేసులు, వివాదాలతో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్‌ఐఆర్‌ తదితర అంశాలపై పిటిషన్లతో ఈ ఎన్నికలకు బ్రేకులు వేయాలని ప్రయత్నం చేస్తుందంటూ ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు సృష్టిస్తూ, వాటినే సాకుగా చూపి ఎన్నికలను నిలిపివేయాలని కుట్రలు చేస్తుందని వైసీపీపై నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టుపై టీడీపీకి పూర్తి గౌరవం ఉందని అన్నారు. న్యాయస్థానం ఆదేశాలకు పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘమేనని ఆయన పేర్కొన్నారు. పోలవరం సహా రాష్ట్రాభివృద్ధికి అడ్డంకులు సృష్టించడం వైసీపీకి అలవాటుగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ.. ప్రజాతీర్పును గౌరవించాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక ఎన్నికలను అడ్డుకోలేరంటూ వైసీపీ నేతలకు ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నామినేషన్ల వేసే సమయంలో అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలి: ఎస్ఈసీ

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

For More AP News And Telugu News

Updated Date - Oct 21 , 2026 | 09:16 PM