Share News

మా ప్రిపరేషన్‌లో లోపం లేదు.. వాళ్లు అద్భుతంగా ఆడారు: ప్యాట్ కమిన్స్

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:56 PM

డార్విన్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమిపై ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.

మా ప్రిపరేషన్‌లో లోపం లేదు.. వాళ్లు అద్భుతంగా ఆడారు: ప్యాట్ కమిన్స్
Pat Cummins,

స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ ఏ విషయాన్నైనా దాచకుండా నిర్మొహమాటంగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. డార్విన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమిపై కూడా కమిన్స్ ఏ రకమైన సాకులు వెతుక్కోలేదు. ప్రత్యర్థి జట్టు ఆటకు తగిన గుర్తింపు ఇస్తూనే, తొలి రోజు ఆటలోనే తమ జట్టు మ్యాచ్‌పై పట్టు కోల్పోయిందని అతడు అంగీకరించాడు.


ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు పడిన శ్రమను, చేసిన త్యాగాలను కమిన్స్ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. 'తమ ఆటగాళ్లలో కొందరు కేవలం 20 రోజుల వ్యవధిలో దాదాపు అర మిలియన్ పౌండ్ల (రూ. 5 కోట్లకు పైగా) ఆదాయాన్ని ఇచ్చే ‘ది హండ్రెడ్’ లీగ్ కాంట్రాక్టులను కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశారు' అని కొన్ని నెలల క్రితం కమిన్స్ అన్నాడు.


తాజాగా ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో జట్టు సన్నాహకాలపై విమర్శలు రావడం సహజమే అయినా, కమిన్స్ మాత్రం తమ ప్రిపరేషన్‌పై ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశాడు. 'మా ప్రాక్టీస్ సరైన రీతిలోనే సాగింది. అందులో ఎలాంటి లోపం, నిర్లక్ష్యం లేదు. అలానే ఓటమిపై ఎలాంటి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ జట్టు అద్భుతంగా ఆడింది. తొలి రోజు వికెట్ కాస్త అనుకూలించినప్పటికీ, మేము క్రీజులో ఎక్కువ సమయం నిలదొక్కుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయాం' అని కమిన్స్ వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

IND vs SL: సచిన్ సరసన యశస్వి జైస్వాల్

బంగ్లాదేశ్ సంచలనం.. టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక విజయం..

Updated Date - Aug 16 , 2026 | 01:07 PM