Share News

IND vs SL: సచిన్ సరసన యశస్వి జైస్వాల్

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:13 PM

టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

IND vs SL: సచిన్ సరసన యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో యశస్వి 32 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఇది యశస్వి కెరీర్‌లో 30వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.


కెరీర్‌లో తొలి 30 టెస్టులను భిన్నమైన వేదికల్లో ఆడిన భారత (Team India) ఆటగాళ్ల జాబితాలో మొన్నటి వరకూ ఇద్దరే ఉండేవారు. తాజాగా ఆ జాబితాలో మూడో ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్ చేరాడు. మాజీ క్రికెటర్ సంజయ్‌ వరుసగా 33 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడాడు. అయితే, అతడి కెరీర్‌లో మొత్తం టెస్టులు 37 మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత సచిన్‌ 32 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడగా.. ఇప్పుడు యశస్వి 30 టెస్టులను పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ ఇప్పటి వరకు మొత్తం 55 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 2,567 పరుగులు ఉన్నాయి.


ఇక సచిన్ (Sachin Tendulkar) తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టులు ఆడాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంజయ్‌ ఘనతను అధిగమించే అవకాశం జైస్వాల్‌కి ఉంది. ప్రస్తుతం శ్రీలంకతో రెండో టెస్టుకు కొలంబో వేదిక. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ఉంది. అప్పుడు యశస్వి సంజయ్ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

బంగ్లాదేశ్ సంచలనం.. టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక విజయం..

దేవ్‌దత్‌ శతక మోత

Updated Date - Aug 16 , 2026 | 12:15 PM