వచ్చేనెల 15 నుంచి ఎంపీఎల్
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:53 AM
ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కొత్త లీగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో...
విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కొత్త లీగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాలుగు జట్లతో మహిళా ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)ను నిర్వహించనున్నట్టు ఏసీఏ అధ్యక్షులు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. ఇక్కడి ఏసీఏ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కేశినేని చిన్ని, భారత మహిళల మాజీ కెప్టెన్, ఏసీఏ మహిళల జట్టు మెంటార్ మిథాలీ రాజ్, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ లీగ్ వివరాలను వెల్లడించారు. ఎంపీఎల్ వచ్చేనెల అంటే.. సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరి క్రికెట్ స్టేడియంలో జరగనుందని కేశినేని చిన్ని తెలిపారు. బిడ్డింగ్ విధానం ద్వారా నాలుగు ఫ్రాంచైజీలను ఖరారు చేశామన్న ఆయన.. లీగ్‌లో పాల్గొనే క్రీడాకారిణుల వేలం కోసం ఇప్పటికే 200 మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. మహిళా ప్రీమియర్ లీగ్ ఏసీఏలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మిథాలీ అన్నారు. గ్రామీణ ప్రాంత క్రికెటర్ల ప్రతిభకు ఈ లీగ్ మంచి వేదిక అవుతుందన్నారు. ప్రస్తుతం నాలుగు జట్లతో ప్రారంభిస్తున్న ఈ లీగ్‌ను భవిష్యత్‌లో మరిన్ని ఫ్రాంచైజీలకు విస్తరిస్తామని కళ్యాణ్ కృష్ణ చెప్పారు.
ఇవి కూడా చదవండి..
బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..