Share News

బంగ్లాదేశ్ సంచలనం.. టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక విజయం..

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:01 AM

ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్‌కు టెస్టు క్రికెట్‌లో ఇదే తొలి విజయం.

బంగ్లాదేశ్ సంచలనం.. టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై చరిత్రాత్మక విజయం..
Bangladesh beat Australia

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్‌కు టెస్టు క్రికెట్‌లో ఇదే తొలి విజయం. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్.. ఆతిథ్య జట్టుకు గట్టి షాకిచ్చింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది (Bangladesh beat Australia).


మొదటి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే ఆలౌటైన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కాస్త ప్రతిఘటన చూపించింది. కామెరాన్ గ్రీన్ అద్భుతమైన సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 284 పరుగులు చేయగలిగింది. దీంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల లక్ష్యం నిలిచింది. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు (Bangladesh historic win).


కాగా, తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 426 పరుగులు చేసింది (Australia vs Bangladesh Test). ఓపెనర్ తంజిద్ హసన్ 101 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, నజ్ముల్ హొస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్ తదితరులు కూడా రాణించారు. దీంతో బంగ్లాదేశ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో హసన్ మహ్మూద్ 6 వికెట్లు పడగొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో మెహిదీ హసన్ మిరాజ్ 5 వికెట్లు తీశాడు.


ఇవి కూడా చదవండి..

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..


భార్యతో గొడవ.. భర్త ఎంత పని చేశాడంటే..

Updated Date - Aug 16 , 2026 | 11:20 AM