శ్రీలంక ఓటమి.. సెమీస్ నుంచి పాకిస్థాన్ ఔట్!
ABN , Publish Date - Feb 26 , 2026 | 08:47 AM
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా నిన్న కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. 61 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక్కడ శ్రీలంక టోర్నీ నుంచి ఔట్ కావడంతో పాటు..
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా నిన్న(బుధవారం) కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. 61 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక్కడ శ్రీలంక టోర్నీ నుంచి ఔట్ కావడంతో పాటు పాకిస్థాన్ ను కూడా దాదాపు ఇంటి బాట పట్టేలా చేసింది. ఇక్కడ అధికారికంగా పాకిస్థాన్ టోర్నీ నుంచి ఔట్ కాకపోయినప్పటికీ సెమీస్ ఛాన్సులు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అద్భుతాలు జరిగితే తప్ప పాక్ సెమీస్ కు రావడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. మరి.. సెమీ ఫైనల్స్‌కు చేరేందుకు పాక్‌కు ఉన్న అవకాశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వాస్తవానికి నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక గెలిచి ఉంటే.. పాకిస్థాన్ సెమీస్ ఆశలు చాలా మెండుగా ఉండేవి. ఒకవేళ లంక ఓడినా.. తక్కువ పరుగుల తేడాతో ఓడి ఉంటే.. పాక్‌కు ఊరట ఉండేది. అయితే భారీ తేడాతో శ్రీలంక ఓడిపోవడంతో కివీస్ జట్టు నెట్ రన్‌రేట్ భారీగా పెరిగింది. ఇదే పాకిస్థాన్‌కు అసలు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇప్పటికే నెగిటివ్ రన్ రేట్‌లో ఉన్న పాకిస్థాన్ తన తదుపరి మ్యాచుల్లో భారీగా గెలిస్తేనే పాయింట్ల పరంగా న్యూజిలాండ్‌తో సమానంగా ఉంటుంది. లంకపై పాకిస్థాన్ గెలవడంతో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సి పరిస్థితి ఏర్పడింది.
గ్రూప్-2 తదుపరి మ్యాచుల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ను ఓడించాలి. ఇదే సమయంలో పాకిస్థా్న్ భారీ తేడాతో శ్రీలంకపై గెలిస్తే.. నెట్ రన్‌రేట్ ఆధారంగా పాక్ సెమీస్‌కు చేరుతుంది. ఒక వేళ కివీస్ ఇంగ్లండ్‌ను ఓడిస్తే.. లంకతో మ్యాచ్‌కు ముందే పాకిస్థాన్ టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లండ్ గెలవాలని పాక్ గట్టిగా కోరుకోవాలి.
ప్రస్తుతం సూపర్ 8 గ్రూప్-2 పాయింట్ల పట్టిక:
ఇంగ్లండ్- 4 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ +1.491
న్యూజిలాండ్- 3 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ +3.050
పాకిస్థాన్-1 పాయింట్, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ -0.461
శ్రీలంక-0 పాయింట్లు, 2 మ్యాచ్‌లు, నెట్ రన్‌రేట్ -2.800
గ్రూప్ 2లో మిగిలిన మ్యాచ్‌లు
ఫిబ్రవరి 27: న్యూజిలాండ్ vs ఇంగ్లండ్
ఫిబ్రవరి 28: పాకిస్థాన్ vs శ్రీలంక
ఇవి కూడా చదవండి:
మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్