Share News

లంకను సాగనంపారు

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:38 AM

టీ20 వరల్డ్‌క్‌పలో శ్రీలంక కథ ముగియగా.. న్యూజిలాండ్‌ సెమీస్‌కు మరింత చేరువైంది. మిచెల్‌ శాంట్నర్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47, 1/19), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రచిన్‌ రవీంద్ర (32, 4/27) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టడంతో...

లంకను సాగనంపారు

న్యూజిలాండ్‌ విజయం

  • బాదేసిన శాంట్నర్‌

  • తిప్పేసిన రచిన్‌

కొలంబో: టీ20 వరల్డ్‌క్‌పలో శ్రీలంక కథ ముగియగా.. న్యూజిలాండ్‌ సెమీస్‌కు మరింత చేరువైంది. మిచెల్‌ శాంట్నర్‌ (26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47, 1/19), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రచిన్‌ రవీంద్ర (32, 4/27) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టడంతో.. సూపర్‌-8లో భాగంగా గ్రూప్‌-2లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ 61 పరుగులతో లంకను చిత్తు చేసింది. తొలుత కివీస్‌ 20 ఓవర్లలో 168/7 స్కోరు చేసింది. కోల్‌ మకాన్‌చీ (31 నాటౌట్‌) విలువైన పరుగులు అందించాడు. తీక్షణ, చమీర చెరో 3 వికెట్లు తీశారు. ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 107/8 స్కోరుకే పరిమితమైంది. కమిందు మెండిస్‌ (31), వెల్లలగే (29) టాప్‌ స్కోరర్లు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే ఓపెనర్‌ నిస్సాంక (0)ను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేర్చిన హెన్రీ (2/3).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అసలంక (5)ను కూడా అవుట్‌ చేసి ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. తర్వాత కుశాల్‌ మెండిస్‌ (11), పవన్‌ రత్నాయకె (10), కెప్టెన్‌ షనక (3), హేమంత (3)ను రచిన్‌ వెనక్కి పంపడంతో 59/6తో లంక ఏదశలోనూ కోలుకోలేకపోయింది. సూపర్‌-8లో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడడంతో లంక సెమీస్‌ అవకాశాలు ఆవిరయ్యాయి.

చివర్లో దంచేశారు..: లంక పేస్‌-స్విన్‌ ద్వయం చమీర, తీక్షణ దెబ్బకు 84/6తో కష్టాల్లోపడిన కివీస్‌.. వంద పరుగులైనా చేస్తుందా? అని అనిపించింది. కానీ, డెత్‌ ఓవర్లలో కెప్టెన్‌ శాంట్నర్‌, మకాన్‌చీ ధనాధన్‌ ఆటతో.. కివీస్‌ సవాల్‌ విసరగలిగే స్కోరు చేసింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 84 రన్స్‌ జోడించడంతో జట్టు స్కోరు 160 మార్క్‌ దాటింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీ్‌సకు ఓపెనర్లు టిమ్‌ సైఫర్ట్‌ (8), ఫిన్‌ అలెన్‌ (23) తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యంతో నిలకడైన ఆరంభాన్నిచ్చారు. అయితే, అలెన్‌ను తీక్షణ రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కిపంపగా.. సైఫర్ట్‌ను చమీర అవుట్‌ చేశాడు. ఆ తర్వాత రచిన్‌, ఫిలిప్స్‌ (18) మూడో వికెట్‌కు 41 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఫిలి్‌ప్సను చమీర, రచిన్‌ను తీక్షణ అవుట్‌ చేయడంతో కివీస్‌ బ్యాటింగ్‌ ఒక్కసారిగా కుదుపులకు గురైంది. చాప్‌మన్‌ (0), మిచెల్‌ (3) విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్‌ శాంట్నర్‌, మకాన్‌చీ ఎదురుదాడితో లంక బిత్తరపోయింది. ఆఖరి 4 ఓవర్లలోనే 70 పరుగులు సమర్పించుకొంది.

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌: 20 ఓవర్లలో 168/7 (శాంట్నర్‌ 47, రచిన్‌ 32; తీక్షణ 3/30, చమీర 3/38). శ్రీలంక: 20 ఓవర్లలో 107/8 (కమిందు 31, వెల్లలగే 29; రచిన్‌ 4/27, హెన్రీ 2/3).

ఇవి కూడా చదవండి:

మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

Updated Date - Feb 26 , 2026 | 05:38 AM