Share News

ఆరు దశాబ్దాలుగా టీమిండియాకు వీరాభిమాని..

ABN , Publish Date - Nov 23 , 2026 | 07:15 PM

సాధారణంగా ఏ జట్టుకైనా వారి సొంత దేశంలో వీరాభిమానులు ఉండటం సహజం. కానీ ప్రత్యర్థి జట్లకు వీరాభిమానులుగా ఉండటం చాలా అరుదు. న్యూజిలాండ్‌కు చెందిన ఆంథోనీ బ్రౌన్‌ అనే క్రికెట్ అభిమాని ఈ కోవకే చెందుతాడు.

ఆరు దశాబ్దాలుగా టీమిండియాకు వీరాభిమాని..
Anthony Browne

స్పోర్ట్స్ డెస్క్: ఏ జట్టుకైనా వారి దేశంలో అభిమానులు, వీరాభిమానులు ఉండటం సర్వసాధారణం. కానీ సొంత దేశంలో ప్రత్యర్థి జట్లకు వీరాభిమానులుగా ఉండటం చాలా అరుదు కనిపిస్తుంది. కొందరు తమ దేశ జట్టు కంటే.. ఇతర జట్టును తెగ అభిమానిస్తుంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రికెట్ అభిమాని. న్యూజిలాండ్ (New Zealand) ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి అయిన ఆంథోనీ బ్రౌన్‌కు భారత్ క్రికెట్ జట్టు అంటే ఎంతో అభిమానం.


న్యూజిలాండ్ పౌరుడైన ఆంథోనీ బ్రౌన్‌ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. 1968లో మన్సూర్ అలీఖాన్ పటౌడీ కెప్టెన్సీలో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అప్పుడు కాలేజీ విద్యార్థిగా ఉన్న ఆంథోనీ (Anthony Browne) బ్లూ జెర్సీకి ఆకర్షితుడై వీరాభిమానిగా మారారు. ఇక అప్పటి నుంచి దాదాపు ఆరు దశాబ్దాలుగా న్యూజిలాండ్‌లో భారత్‌ ఆడే ప్రతి టెస్టు మ్యాచ్‌ కోసం స్టేడియానికి వెళ్తుంటారు. ప్రస్తుతం 78 ఏళ్ల వయసున్న ఆంథోనీ బ్రౌన్.. వెలింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ను (NZ vs IND) కూడా స్టేడియంలో కూర్చుని వీక్షించారు.


ఆంథోనీ న్యూజిలాండ్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేసి ఆ తర్వాత చైనాలో ఆదేశ రాయబారిగా వ్యవహరించారు. 20వ దశకం ప్రారంభంలో ఆయనకు ఎంతో ఇష్టమైన భారత్‌లో న్యూజిలాండ్ హై కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది. కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ బాధ్యతలను చేపట్టలేకపోయారు. తన ముత్తాత, అతడి సోదరులు 1850ల ప్రారంభంలో కోల్‌కతా నుంచి న్యూజిలాండ్‌కు వచ్చారని.. వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఆంథోనీ బ్రౌన్ వెల్లడించారు. 1968లో తొలిసారి పటౌడీ నేతృత్వంలో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుని ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది. ఆ సమయంలో భారత జట్టు ఆసియా ఖండం వెలుపల విదేశీ గడ్డపై తొలి టెస్ట్ విజయం, తొలి విదేశీ టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది.


ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. టీమిండియా కీలక నిర్ణయం

డ్రా అయినా టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు.. ఒకే ఇన్నింగ్స్‌లో 8 మంది బౌలర్లు!

Updated Date - Nov 23 , 2026 | 07:24 PM