Share News

ఆంధ్ర హ్యాట్రిక్‌

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:10 AM

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆంధ్ర హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో...

ఆంధ్ర హ్యాట్రిక్‌

చండీగఢ్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆంధ్ర హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో అసోంను చిత్తు చేసింది. మొదట అసోం 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 134 పరుగులు చేసింది. శివశంకర్‌ రాయ్‌ (38), సాహిల్‌ జైన్‌ (31 నాటౌట్‌), నిహార్‌ (27) ఓ మోస్తరుగా ఆడారు. నరసింహరాజు, సత్యనారాయణ రాజు, కేవీ శశికాంత్‌ తలా రెండేసి వికెట్లు సాధించారు. ఛేదనను ఆంధ్ర 11.4 ఓవర్లలో 136/2 స్కోరుతో పూర్తి చేసింది. హేమంత్‌ రెడ్డి (64) ధనాధన్‌ హాఫ్‌ సెంచరీతో మెరవగా, రషీద్‌ (41 నాటౌట్‌), ప్రసాద్‌ (27) ఽసత్తా చాటారు. జితూమోనీ రెండు వికెట్లు తీశాడు. గత రెండు మ్యాచ్‌ల్లో..కేరళ, మధ్యప్రదేశ్‌లపై ఆంధ్ర గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 23 , 2026 | 05:10 AM