Share News

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. టీమిండియా కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 23 , 2026 | 06:33 PM

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు భారత్ క్రికెట్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరగాల్సిన రెండో టెస్టుకు ముందు నిర్వహించాలనుకున్న చిన్నపాటి ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసింది.

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. టీమిండియా కీలక నిర్ణయం
Shubman Gill

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు భారత్ క్రికెట్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరగాల్సిన రెండో టెస్టుకు ముందు నిర్వహించాలనుకున్న చిన్నపాటి ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసింది.కాగా కివీస్‌- భారత్‌ మధ్య వెల్లింగ్టన్‌ వేదికగా తొలి టెస్టు ఇవాళ(సోమవారం) ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే.


మ్యాచ్ విషయానికి వస్తే... టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా 9 వికెట్లు కోల్పోయి... 720 పరుగుల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. అయితే, ఆఖరి రోజు ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ 239 పరుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లు డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ పట్టుదలగా నిలబడటంతో గెలవాలన్న భారత్ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు 121 ఓవర్లు,రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లు బౌలింగ్‌ చేశారు. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అత్యధికంగా 55 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. మరోవైపు.. కివీస్‌ మాత్రం కేవలం 166 ఓవర్లే బౌలింగ్‌ చేసింది.


ఈ నేపథ్యంలో బౌలర్లపై పనిభారం తగ్గించే క్రమంలో రెండో టెస్టుకు ముందు టీమ్‌ యాక్టివిటీని రద్దు చేస్తున్నట్లు భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ప్రకటించాడు. తొలి టెస్టు డ్రా అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘మా బౌలర్లు చాలా ఓవర్లు బౌలింగ్‌ చేశారు. వాళ్లను కచ్చితంగా డిన్నర్‌కి తీసుకువెళ్తాము. నిజానికి మాకొక టీమ్‌ యాక్టివిటీ సెషన్‌ ఉంది. కానీ తొలి టెస్టులో ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌ చేయాల్సి వచ్చినందున దానిని రద్దు చేస్తున్నాము. ముఖ్యంగా మా ఫాస్ట్‌బౌలర్లు బాగా అలసిపోయారు. పనిభారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము’ అని గిల్‌ స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

డ్రా అయినా టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు.. ఒకే ఇన్నింగ్స్‌లో 8 మంది బౌలర్లు!

విజయానికి 8 వికెట్లు

Updated Date - Nov 23 , 2026 | 06:33 PM